ఘనంగా వకీల్ సాబ్ పిట్టల భూమేష్ జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలం గుండారం గ్రామంలో ని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యం లో వకీల్ సాబ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిట్టల భూమేష్ ముదిరాజ్ 50వ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జజ్జరి నర్సయ్య, ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్ జజ్జరి బాలనర్స్ , బోయిని బాలయ్య, జెట్టి కిషన్ , అనుప కిషన్ , 70 మంది ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

 Grand Birthday Celebrations Of Vakil Saab Pittala Bhumesh-TeluguStop.com

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగారాజన్న సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రముఖ న్యాయవాది, తెలంగాణ రాష్ట్ర మాజీ సర్పంచుల సంఘం న్యాయ సలహాదారు, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పిట్టల భూమేష్ ముదిరాజ్ 50వ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు సోమవారం ఘనంగా జరిపారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల పైగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు వారిసాదకబాదకాల్లో తల్లోనాలుకగా ఉంటూ ప్రజా పోరాటాలు చేసిన నాయకుడు పిట్టల భూమేష్ ముదిరాజ్ ని,ముదిరాజు సామాజికవర్గ సమాస్యలపైన, బిసి,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రయోజనాల కోసం, పరితపిస్తూ అనునిత్యం ప్రజల్లో ఉన్న నాయకుడు పిట్టల భూమేష్ ( Pittala Bhumesh )ని ప్రజా ప్రయోజనం కోసమే రేవంత్ రెడ్డి( Revanth Reddy ) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ బలోపేతంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ప్రకటించారు.

ఈ కార్యక్రమాలో మాజీ సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపకుడు బొడ్డు దేవయ్య,రాష్ట్ర ప్రధన కార్యదర్శి ఏరెడ్డి మల్లారెడ్డి,జిల్లా అధ్యక్షుడు మిర్యాల్కర్ శ్రీనివాస్, ఎడ్ల రాజ్ కుమార్, ఉస్మానియా యునివర్సిటీ జాక్ నాయకుడు లింగంపల్లి రవితేజ, సామల వెంకన్న, లింగంపల్లి మధూకర్, సంపునూరి మల్లేశం గౌడ్,గుడిసె రమేష్, లింగంపల్లి మహేష్ సందీప్ కుమార్, అందె ఈశ్వర్,అందె శ్రీనివాస్, సాయి చంద్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube