ఆత్మకూర్(ఎం) చేరుకున్న బీసీ మహా పాదయాత్ర

యాదాద్రి భువనగిరి జిల్లా:సకల సామాజిక రంగాల్లో మేమెంత మందిమో మాకంత వాటా కావాలని నినదిస్తూ చట్టసభల్లో బీసీల వాటా కోసం మొదలైన బీసీ మహా పాదయాత్ర 10వ,రోజు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రానికి చేరుకుంది.ఆల్ ఇండియా ఓబీసీ జాక్ నేతలు మేకపోతుల నరేందర్ గౌడ్,సాయిని నరేందర్, సిద్ధేశ్వర్,నరహరి లతో కూడిన పాదయాత్ర బృందానికి స్థానిక నాయకులు జన్నాయికోడె నగేష్,బీసు చందర్ గౌడ్, తండ మంగమ్మ,కానుగంటి శ్రీశైలం,నల్లచంద్రస్వామి, జలంధర్,ఎలిమినేటి మురళి,పంజాల నరసయ్య తదితరులు ఘన స్వాగతం పలికారు.

 Bc Maha Padayatra Reached Atmakur(m), Atmakur, Bc Maha Padayatra, Nagesh, Bisu-TeluguStop.com

అనంతరం ధర్మభిక్షం, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలు వేసే నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ నిర్మాణం కోసం,తెలంగాణ సాధన కోసం,ఎన్నో త్యాగాలు చేసిన బీసీలంటే నేడు ఎవరికీ లెక్కలేదని, గత 75 ఏళ్లుగా జనగణన కోసం,సమాన అవకాశాల కోసం,బీసీలు ఎన్నో పోరాటాలు చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని వాపోయారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, పండుగ సాయన్న,దొడ్డి కొమరయ్య,చాకలిఐలమ్మ,కొండ లక్ష్మణ్ బాపూజీ, మారోజు వీరన్న,బెల్లి లలిత,శ్రీకాంతాచారి లాంటి వీరుల స్ఫూర్తితో ఉద్యమించి చట్టసభల్లో బీసీ వాటా సాధిస్తామని అన్నారు.చట్టసభల్లో బీసీ వాటా సాధన కోసం ప్రజాస్వామ్యంలో అత్యున్నత పోరాట రూపమైన పాదయాత్రను ఎంచుకున్నామని తెలిపారు.

పండుగ సాయన్న ముదిరాజ్ స్వగ్రామం మీర్గాన్ పల్లి నుండి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోట ఖిలాషాపూర్ వరకు పాదయాత్ర సాగుతుందన్నారు.చట్టసభల్లో బీసీ వాటా కోసం సాగుతున్న ఈ పాదయాత్రలో మేధావులు,మహిళలు, విద్యార్థులు,యువత, కార్మికులు,కర్షకులు, పార్టీలకతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ముత్యాలు,శ్రీనివాస్,మల్లేశం,మహేష్,సత్తయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube