ఆధునిక తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే...!

సూర్యాపేట జిల్లా:ఆనాడు అగ్రవర్ణ మనువాద సమాజం ఎన్నో అవమానాలకు గురి చేసినా లెక్కచేయకుండా ముందుకు సాగి అజ్ఞానపు అంధకారంలో ఉన్న బహుజనుల బ్రతుకుల్లో విజ్ఞానపు చదువుల విత్తనం నాటిన ఆధునిక తొలి ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే అని డిటిఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రేపాక లింగయ్య,కమ్యూనిస్ట్ యూనిటీ సెంటర్ (సీయూసీ) కో కన్వీనర్ షేక్ అబ్దుల్ కరీం అన్నారు.సావిత్రి భాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ విద్యార్ధినుల హాస్టల్ లో బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (బి.

 Savitribai Phule Was The First Modern Woman Teacher , Woman Teacher , Savitribai-TeluguStop.com

డి.ఎస్.యు)ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు గాలి వికాస్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సుకు వారు ముఖ్యాతిధులుగా హాజరై మాట్లాడుతూ ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు విద్యా అవసరమని భావించి మహాత్మా జ్యోతిరావు పూలే,తాను బాల్య దశలోనే వివాహం చేసుకున్న సావిత్రి భాయి పూలేకు స్వయంగా అక్షరజ్ఞానం అందించి,మొదటి మహిళా పాఠశాల నెలకొల్పి,తన భార్యను ఉపాధ్యాయురాలిగా చేసి విద్యనందించిన గొప్ప మహనీయుడని,భర్త అడుగుజాడల్లో మహిళా విద్య కోసం నిత్యం అనేక అవమానాలు ఎదుర్కొంటూ ధైర్యంగా పాఠశాలను నడిపిన ఘనత సావిత్రి బాయి ఫూలేకే దక్కిందని కొనియాడారు.ఈ దేశ బహుజనులను బడి వైపు మళ్లించడానికి కృషి చేస్తూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పాఠశాలలను ఏర్పాటు చేసి,వీరు,వారు అని తేడా లేకుండా మహిళలందరికీ చదువుల తల్లి సావిత్రి బాయి పూలేతో పాటు ఫాతిమా షేక్ అనే మరో ఉపాధ్యాయురాలు కూడా కలిసి చదువులు నేర్పించారని గుర్తు చేశారు.

అగ్రవర్ణ బ్రాహ్మణీయ పిల్లలు సావిత్రిబాయి పూలేపై పేడ బురద చల్లి సూటిపోటి మాటలతో అవమానించినా తన బాధను పంటి బిగువన ఓర్చుకొని ఈ సమాజానికి చదువులు నేర్పిన చదువుల తల్లులు వీరిద్దరూ అన్నారు.వీరిద్దరిని భారతదేశంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి మరువకూడదని,ఈ భారత సమాజం వీరిద్దరికీ రుణపడి ఉండాలని కోరారు.

అందుకే వీరిద్దరికీ గౌరవిస్తూ,నేడు  సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పిస్తున్నామన్నారు.అందరికీ సమాన విద్యా, కామన్ విద్యా విధానం కావాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపియుఎస్ఐ నాయకులు చామకూరి నరసయ్య,సిపిఐఎంఎల్ (రామచంద్రన్) పార్టీ జిల్లా కార్యదర్శి భానుప్రసాద్, సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర నాయకులు దడిపల్లి వెంకట్,టీచర్ వెంకటేశ్వర్లు,సాంస్కృతిక కళారంగ కూచిపూడి భరతనాట్య కళాకారుడు వీరునాయుడు,బాల భవన్ ఇన్చార్జి అనిల్ కుమార్, మనోజ్ కుమార్,సురేష్, సంధ్య,లావణ్య తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube