ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలకు ఆరోగ్యం పై కాస్త శ్రద్ధ పెరిగింది అని చెప్పవచ్చు.ఎందుకంటే చాలామంది ప్రజలు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తమ డైట్ లో చేర్చుకుంటూ ఉన్నారు.
అంతేకాకుండా ప్రతిరోజు తమ డైట్ లో ఆకుపచ్చని కూరగాయలు,తాజా పండ్లు ఉండేలా చూసుకుంటున్నారు.ఇలా చేయడం వల్ల వారి రోగనిరోధక శక్తి/em>( Immune system )క్తి పెరిగి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండవచ్చు అని చాలామంది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు.
ఇంకా చెప్పాలంటే ఉల్లికాడల( Onions ) గురించి చాలామందికి తెలిసే ఉంటుంది.వీటిని ఫ్రైడ్ రైస్, నూడిల్స్ వంటి వాటిలో చూస్తూనే ఉంటాం.
అయితే ఉల్లిపాయలు మాత్రమే కాకుండా ఉల్లికాడలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఉల్లికాడల ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పచ్చి ఉల్లిపాయ ఏ వయసు వారికైనా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ముఖ్యంగా దీనీ వినియోగం వృద్ధులకు చాలా మేలు చేస్తుంది.
గుండె ఆరోగ్యానికి( heart health ) చాలా మేలు చేసే పచ్చి ఉల్లిపాయల్లో ఇలాంటి అనేక పోషకాలు ఉంటాయి.దీని రెగ్యులర్ గా వినియోగించడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని దూరం చేస్తుంది.
పచ్చి ఉల్లిపాయ మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.ఉల్లిపాయ వినియోగం రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
అలాగే ఇందులో అధిక మొత్తంలో సల్ఫర్ ఉంటుంది.ఇది రక్తపోటును( Blood pressure ) తగ్గిస్తుంది.
ఇది వాపును కూడా తగ్గిస్తాయి.ఇందులో ఉండే విటమిన్ సి, పోలిక్ యాసిడ్, ఫైబర్ ఇతర పోషకాలు ధమానులను ఆరోగ్యంగా ఉంచుతాయి.వీటిని సలాడ్లలో ఉపయోగించవచ్చు.అలాగే పచ్చి ఉల్లిపాయలను సన్నగా తరిగి చట్నీల తయారు చేసుకోవచ్చు.ఉల్లిపాయలను తక్కువ నూనెలో వేయించి కూడా తినవచ్చు.ఉల్లిపాయలు ఇతర కూరగాయలతో సూప్ తయారుచేసుకుని తాగవచ్చు.
పచ్చి ఉల్లిపాయల రసం తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.