వైరల్ వీడియో: మండుటెండలో అప్పడం కాలుస్తున్న జవాన్..

ప్రస్తుతం వేసవికాలం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో ఎండలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ముఖ్యంగా మన దేశవ్యాప్తంగా పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది.

 Viral Video Of A Jawan Firing In A Torch, Seeing This Video, Viral Video,viral N-TeluguStop.com

అనేక ప్రాంతాల్లో సూర్యుడు దెబ్బకు ప్రజలు విలవిలలాడుతున్నారు.అనేక ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి.

ఇక రాజస్థాన్( Rajasthan ) లాంటి రాష్ట్రాల్లో ఉన్న ఎడారి ప్రాంతంలో అయితే ఈ తీవ్రత మరింత ఎక్కువగా కనబడుతోంది.ఇకపోతే తాజాగా ఓ భారతీయ జవాన్ ఇసుకలో అప్పడాన్ని వేయించడం సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ విషయం సంబంధించిన వీడియో ఒకసారి చూస్తే.

అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ( Himanta Biswasharma )తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ వీడియో షేర్ చేస్తూ ఆయన స్పందించారు.దేశంలోని సరిహద్దు భద్రత దళం బిఎస్ఎఫ్ జవాన్ ఒకరు రాజస్థాన్లోని బికనేర్( Bikaner ) వద్ద నిధులు నిర్వహిస్తున్నారు.అలా చేస్తున్న సమయంలో మధ్యాహ్న సమయంలో అతడు ఒక అప్పడాన్ని తీసుకొని దానిపై ఇసుక కప్పేస్తాడు.

అలా కొద్దిసేపు ఉంచిన తర్వాత ఆ అప్పడంపై ఇసుకను తొలగించి దానిని తీసి చూస్తే అచ్చం స్టవ్ మీద ఎలా అప్పడం వేయిస్తే కరకరలాడుతున్న లాగే ఉంది.ప్రస్తుతం ఆ ఎడారి ప్రాంతంలో ఉష్ణోగ్రత 47 డిగ్రీల వరకు నమోదు అవుతుంది.

ఇక ఈ వీడియోని అస్సాం ముఖ్యమంత్రి షేర్ చేస్తూ.“ఎలాంటి అసాధారణ పరిస్థితులకైనా వెనకాడకుండా దేశం కోసం సేవలు అందిస్తున్న జవాన్లను చూసి నా హృదయం కృతజ్ఞత గౌరవంతో నిండిపోయిందంటూ” పోస్ట్ చేశారు.ఈ వీడియోకి బిఎస్ఎఫ్ ఇండియాను ట్యాగ్ కూడా చేశారు.ఇక ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ భారతదేశ సైనికులపై తమ కృతజ్ఞత భావాన్ని తెలుపుతున్నారు.ఎండ, చలి అంటూ తేడా లేకుండా భారతదేశ పౌరుల కోసం భారత సైన్యం తన సాయి శక్తుల విధులు నిర్వహిస్తున్నట్లు పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.రాజస్థాన్ లో ఇప్పటివరకు 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండి తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube