రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుతో ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్ పల్లి( Shatraj Palli )లో పిడుగుపాటుతో కంబల్ల శ్రీనివాస్ (30) అనే వ్యక్తి మృతి చెందగా, మరో నలుగురికి గాయాలు అయ్యాయి.స్థానికులు గాయాల పాలైన వారిని వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

 Two Dead, Four Seriously Injured In Rajanna Sirisilla District Due To Lightning.-TeluguStop.com

అలాగే తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్ గ్రామంలోని భరత్ నగర్ లో పిడుగుపాటుతో చంద్రయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం నుండి ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది.

రుద్రారపు చంద్రయ్య అనే రైతు( Farmer ) తన పొలం వద్ద పొలం పనులు చేసుకుంటుండగా పిడుగు పడి అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.చంద్రయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube