ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూళ్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్ రిమాండ్ కి తరలింపు

నిరుద్యోగ యువత దళారులను నమ్మి మోసపోవద్దనీ సిరిసిల్ల ఇంచార్జి డీస్పీ నాగేంద్ర చారి( Dsp nagendra chari ) అన్నారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ…ఇల్లంతకుంట మండలం నర్సక్కపేట గ్రామానికి చెందిన ర్యాగటి మల్లయ్య అనే వ్యక్తి 2018 సంవత్సరంలో నర్సక్కపేట గ్రామానికి చెందిన కొత్త లింగ రెడ్డి s/o శంకరయ్య, బొల్లా రాము s/o దేవరెడ్డి, తిప్పారవేని చంద్రశేఖర్ s/o రాజయ్య, దారం శ్రీనివాస్ రెడ్డి s/o ప్రతాపరెడ్డి అనే వ్యక్తులను హుస్నాబాద్ చెందిన ( ప్రస్తుతం సిరిసిల్ల పట్టణం) కారునాథం శివకృష్ణ అనే వ్యక్తి పరిచయ చేయగా ,కారునాథం శివకృష్ణ అనే వ్యక్తి డబ్బులు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాడు అని వారికి నమ్మబలికి వారి వద్ద నుండి 2023 సంవత్సరంలో పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో, సింగరేణి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసి వారి వద్ద నుండి 6,50,000/- రూపాయలు తీసుకొని తప్పించుకొని తిరుగుతుండగా శివకృష్ణను సోమవారం రోజున ఉదయం 11:00am గంటలకు ఇల్లంతకుంట బస్టాండ్ వద్ద అరెస్టు చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని డిఎస్పీ తెలిపారు.

 A Person Who Was Involved In Collecting Money By Promising To Give Government Jo-TeluguStop.com

ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను తప్పుదోవ పట్టించి, వారి వద్ద నుండి భారీ మొత్తంలో నగదును వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారి పై కఠిన చర్యలు తీసుకుంటాం.కష్టపడి చదువుకొని ప్రభుత్వ నోటిఫికేషన్ల నియమావళి ప్రకారం అర్హతలు సాధించి ఉద్యోగాలు సాధించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ,అలాంటి వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందాన్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube