ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రపంచ ప్రయోవృద్ధుల వేధింపుల నివారణ అవగాహన సదస్సు లో భాగంగా ఆర్డీవో కి వినతి పత్రం అందించారు.అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన, డాక్టర్ జనపాల శంకరయ్య, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యనిర్వహణలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం లో ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం అవగాహన సదస్సు ఘనంగా జరిగింది.

 Awareness Conference On World Elder Abuse Prevention Day, Awareness Conference ,-TeluguStop.com

అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య మాట్లాడుతూ సీనియర్ సిటిజనుల చట్టాలపై సమగ్ర అవగాహన లేకనే వెనుకబడడం జరుగుతుందన్న కేంద్ర ప్రభుత్వం వయోవృద్ధులకు 50 శాతం రాయితీ ట్రైన్ ప్రయాణంలో కల్పించాలని, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కలిగించాలని కోరారు.

అందరం ఐక్యతగా పోరాడితే సాధ్యమవుతాయని ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య అన్నారు మరో ఉపాధ్యక్షులు శ్రీగాద మైసయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు ఉన్న ఆస్తినంతా పంచి ఇవ్వకూడదని సలహా ఇచ్చారు.

రాష్ట్ర కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ ప్రపంచ వయోదిక్కుల నివారణ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సు విచ్చేసిన వాళ్ళందరూ బాగా గమనించాలి.చట్టాల అవగాహన లేక ఎందరో వయోవృద్ధులు మోసపోతున్నారని చట్టాల అవగాహన కలిగి ఉంటే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి అన్నారు.

ఆర్టీవో సన్నిధిలో ఉన్న పెండింగ్ కేసులను సత్వర పరిష్కారమునకై చర్యలు గైకొనాలని,

అలాగే సిరిసిల్ల పట్టణంలో డే కేర్ సెంటర్ ను త్వరగా ఏర్పాటు చేసేందుకు చర్యలు గైకొనాలని చేనేత వస్త్ర వ్యాపార సంఘం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ఊరేగింపుగా వెళుతూ మహాత్మా గాంధీ కి పూలమాలవేసి అక్కడి నుండి ఆర్డిఓ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది.అలాగే పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించవలసిందిగా కోరారు.

తల్లిదండ్రులను పోషించే బాధ్యత పిల్లలేదే, ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్రీ గాదమైసయ్య, కోశాధికారి దొంత దేవదాసు, ముఖ్య సలహాదారులు కోడం నారాయణ, కార్యవర్గ సభ్యులు గుడ్ల శ్రీధర్, చికోటి రవీందర్ , మిట్టపల్లి రాములు, అంకారపు జ్ఞానోబా, రాపెళ్లి ముకుందం గౌరిశెట్టి ఆనందం గజ్జెల్లి రామచంద్రం, కోడం శంకర్, నక్క మనోహర్, వేములవాడ శంకర్, రిటైర్డ్ కానిస్టేబుల్ పోచయ్య సుమారు 40 మంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube