శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు - సిరిసిల్ల సీఐ సదన్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక, సోమవారపేట్, పెద్ద లింగాపూర్, గొల్లపల్లి, వెంకట్రావుపల్లి, రామోజీపేట గ్రామాల్లో కేంద్ర బలగాలచే శుక్రవారం రోజున ఉదయం కవాతు నిర్వహించారు.ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగవలసిన అవసరం ఉందని, ప్రతి పౌరుడు తన యొక్క ఓటును స్వేచ్ఛగా వినియోగించేలా చూడాలని, ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడినా,అమాయక ప్రజలను బెదిరించినా చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు.

 Strict Action Will Be Taken If There Is Disturbance Of Peace And Security Sirici-TeluguStop.com

ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తన ఓటు ను వినియోగించుకునేందుకు, ప్రశాంత వాతావరణo లో ఎన్నికలు జరిగేలా, ప్రతి పౌరుడిలో ధైర్యం నింపేందుకు ఎన్నికల కమిషన్ కృషి చేస్తుందని వివరించారు.

ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉందని, ఇతరుల ఎన్నికల ప్రచారాన్ని గాని కార్యక్రమాలను గాని ఎవరైనా ఆటంకపరిచినా, అడ్డగించినా కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల రూరల్ సిఐ సదన్ కుమార్ తెలిపారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ లు భూమయ్య ఫసియోద్దిన్, కానిస్టేబుళ్లు మధు లక్ష్మినారాయణ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube