రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ( Yellareddipet )ల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో శనివారం బీఎస్పీ మండల శాఖ అధ్యక్షులు నీరటి భాను, మండల గౌడ సంఘం అధ్యక్షులు గంట కార్తీక్ గౌడ్ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.వీరికి సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి( KK Mahender Reddy ) కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
గన్న శోభ ఆధ్వర్యంలో 20 మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.అక్కపల్లి, దుమాల గ్రామానికి చెందిన కొంత మంది రైతులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు నాయకులకు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ( Congress party ) హామీ ఇచ్చిందంటే వెనుకడుగు వేయదని ఆరు గ్యారెంటీలను ( Six guarantees )నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు.
బడుగు బలహీన వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని ఇతర పార్టీలు వారి ఓట్ల కోసం తప్ప వారి భవిష్యత్తు కోసం ఆలోచించాలని అన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీ ఖజానాతో ఉందని అయినప్పటికీ ఏ ఒక్క రంగంలో కూడా వెనుకడుగు వేయకుండా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు.
పార్టీ ఫిరాయింపులు ఇష్టం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాటిమాటికి పడగొడతామని బిజెపి.బిఆర్ఎస్ రెండు పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య,జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్,జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, బండారి బాల్ రెడ్డ,పందిర్ల సుధాకర్ గౌడ్,చేపూరి రాజేశం కొమిరిశెట్టి తిరుపతి, కొండాపురం శ్రీనివాసరెడ్డి,వంగ మల్లారెడ్డి, చెన్ని బాబు,భూమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








