వేములవాడలో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ 132 వ జయంతి వేడుకలు.....

రాజన్న సిరిసిల్ల జిల్లా : అంబేద్కర్ జయంతి సందర్భంగా శాత్రజ్ పల్లి, తిప్పాపూర్ లో రాజరాజేశ్వర స్వామి వారి గుడి ముందర గల గల అంబేద్కర్ విగ్రహానికి, నాంపల్లి లో అంబేద్కర్ చిత్రపటానికి పాలకవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అంబేద్కర్ సంఘం నాయకులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు.ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు హాజరయ్యారు.

 Dr. Babasaheb's 132nd Birth Anniversary Celebrations In Vemulawada,. Ambedkar Ja-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా గుర్తింపబడిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించి ప్రజలకు హక్కులను కల్పించారని భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం,అంటరానితనం కుల నిర్మూలన కోసం అంబేద్కర్ గా ఎంతగానో కృషి చేశారని సామాజిక ఆసమానతలపై దళితుల సామాజిక రాజకీయ హక్కుల గురించి పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు.

ప్రజలు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నారంటే అది అంబేద్కర్ కల్పించిన రాజ్యాగం హక్కు అని, రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే మనమందరం ఉన్నతంగా జీవిస్తున్నామని తెలిపారు.

భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని వీరికి ఘనంగా నివాళులు అర్పించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ ని గౌరవించి హైదరాబాద్ నడి ఒడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ గారి విగ్రహాన్ని కేసీఆర్ ఈరోజు ఆవిష్కరించారని అన్నారు.దళితుల సంక్షేమం వారి ఆర్థిక ఎదుగుదల కోసం దళిత బంధు వంటి పథకాలు తీసుకవచ్చి వారి ఆర్థిక ఎదుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో తోడ్పడిందని వారన్నారు.

అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కౌన్సిలర్ కుమ్మరి శిరీష శ్రీనివాస్ ఆధ్వర్యంలో, అంబేద్కర్ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మున్సిపల్ చైర్ పర్సన్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమాలలో కమిషనర్ అన్వేష్ , గౌరవ పాలకవర్గ సభ్యులు,కోఆప్షన్ సభ్యులు,తిరుపతిరెడ్డి ,రాజు ,ప్రజా ప్రతినిధులు,అంబేద్కర్ సంఘంనాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube