రాజన్న సిరిసిల్ల జిల్లా: అయోధ్య శ్రీరాముని పూజిత పవిత్ర అక్షింతలు గురువారం జై శ్రీరామ్ అయోధ్య జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం నుంచి తెచ్చిన అక్షింతలకు శ్రీ రాముని ఉత్సహా విగ్రహాలకు ఆలయ ప్రధాన అర్చకులు గుండయ్య శర్మ( Gundaya Sharma ) , శ్రీ రాజరాజేశ్వర ఆలయ పూజారి శ్రీ కాంత్ శర్మలు ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం కలశాన్ని సత్సంగ సదనం అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి , గుండయ్య శర్మ , స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి తలపైన ఎత్తుకొని మోయడం ప్రారంభించారు , అనంతరం ఈ శోభ యాత్ర లో పాల్గొన్న భక్తులు అందరు తల కొద్ది సేపు మోశారు.
అదేవిధంగా శ్రీ సీతారామాంజనేయస్వామి ఉత్సహా విగ్రహాన్ని పల్లకిలో సత్సంగ సదనం వరకు భక్తులు మోశారు.డిజియో భక్తి పాటలతో భక్తులు నృత్యాలు చేస్తూ ఎల్లారెడ్డిపేట శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం నుంచి పాత బస్టాండ్ , అంబేద్కర్ , నంది విగ్రహాల మీదుగా శ్రీ వేణుగోపాలస్వామి బాలాలయం నుండి గాంధీ విగ్రహం మీదుగా సత్సంగ సదనం వరకు గ్రామోత్సవం నిర్వహించి సత్సంగ సదనం లో అక్షింతలను ఉంచారు.
ఈ సందర్భంగా జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బాద్యులు పద్మారెడ్డి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ మన జన్మకు దొరికిన అరుదైన అవకాశం ఇదన్నారు.కోట్లాది హిందువుల కల గత ఐదు శతాబ్దాల పోరాటాల ఫలితంగా రామ జన్మభూమి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతుందన్నారు సరయు తీరంలో రూపుదిద్దుకుంటున్న శ్రీరామ జన్మభూమి లో భవ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
ప్రధాన గర్భాలయం ప్రాణప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా ఒక్కొక్క ఘట్టం ఆవిష్కరణ జరుగుతుందన్నారు.జనవరి 1న ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రతి ఇంటికి అక్షింతలు పంపిణీ చేస్తారన్నారు.
జనవరి 22 వ తేదీన అయోధ్యలో( Ayodhya ) శ్రీరాముని ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని భక్తులు ఈ అక్షింతలను పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి , శ్రీ వేణుగోపాలస్వామి( Sri Venugopalaswamy ) ఆలయ పూజారి నవీన్ చారి( Naveen Chari ), శ్రీ మార్కండేయ ఆలయ పూజారి ఉమా శంకర్, ఆలయ కమిటీ వారు నంది కిషన్, ఉపేంధర్ , గంట వెంకటేష్ గౌడ్ , ముత్యాల ప్రభాకర్ రెడ్డి , రవీందర్ గుప్తా, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి సత్సంగ సదనం ప్రతినిధులు రాంరెడ్డి , సంజీవ్ రెడ్డి, అనంత రెడ్డి , కృష్ణ భక్తులు సనుగుల ఈశ్వర్ , పోతు ఆంజనేయులు , నాగేంద్రం సార్, బచ్చు ఆంజనేయులు, శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి నాయకులు ధూస శ్రీ నివాస్, మెగి నర్సయ్య , బందారపు బాల్ రెడ్డి, నేవూరి జగన్ రెడ్డి, ముత్యాల లింగారెడ్డి , ఎలగందుల బాబు, బిజెపి నాయకులు రాజేశం గుప్తా , సత్యం రెడ్డి , యాదవ్ , అమరేందర్ రెడ్డి , నాయక్, సందుపట్ల లక్ష్మారెడ్డి , పారిపెల్లి రాంరెడ్డి, పారిపెల్లి సంజీవ్ రెడ్డి , రంజిత్, కిష్టారెడ్డి, మహిళా భక్తులు, అయ్యాప్పా భక్తులు పాల్గొన్నారు.
అనంతరం సత్సంగ సదనం వారు భక్తులకు పులిహోర, అరటిపండు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు ,
.