రాజన్న సిరిసిల్ల జిల్లా : సిఐటియూ 54 వ ఆవిర్బవ దినోత్సవాన్ని పునస్కరించుకొని గురువారం సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బి.వై.
నగర్ లోని సిఐటియు కార్యాలయం ముందు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి జెండా ఆవిష్కరించడం జరిగింది.అనంతరం కేక్ కట్ చేసి సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్.కూరపాటి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ 1970 సంవత్సరం లో ఐక్యత -పోరాటం అనే నినాదం తో దోపిడీ లేని సమాజం నిర్మించడమే లక్ష్యంగా సిఐటియు ఆవిర్భవించడం జరిగిందని, గత 54 సంవత్సరాలుగా సిఐటియు ఆధ్వర్యంలో సంఘటిత , అసంఘటిత కార్మికుల సమస్యలపై ప్రైవేటు , పబ్లిక్ సెక్టార్ కార్మికుల , ఉద్యోగుల చట్టాలు హక్కుల సాధన కోసం అనేక పోరాటాలు చేపట్టి విజయం సాధించడం జరిగిందని అన్నారు.
ప్రభుత్వాలు విద్యా ,వైద్యం ప్రయివేట్ చేయటం వలన కార్మిక వర్గం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను కార్పరేట్ శక్తుల కొరకు ఆ చట్టాలను నిర్వీర్యం చేసిందన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థ లను కేంద్ర ప్రభుత్వం ప్రయివేట్ చేయటం వలన నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, ఫలితంగా రిజర్వేషన్ విధానాన్ని ప్రభుత్వము దెబ్బ తీస్తుందని అన్నారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టాన్ని సవరించటంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని అన్నారు.
రాబోయే రోజుల్లో కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం , కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ కోసం సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టబోయే ఐక్య పోరాటాలలో కార్మిక వర్గ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్ , సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ గుర్రం అశోక్ , ఎలిగేటి రాజశేఖర్ , అన్నల్దాస్ గణేష్ , ప్రజాసంఘాలు , వివిధ రంగాల నాయకులు జవ్వాజి విమల , సూరం పద్మ , లింగంపల్లి కృష్ణవేణి , నక్క దేవదాస్ , గుండు రమేష్ , సిరిమల్ల సత్యం , బుర్ర శ్రీనివాస్ , మల్లారపు ప్రశాంత్ , చిలుక బాబు , గాంతుల మహేష్ , అనిల్ , మల్లేశం , చంద్రకాంత్ , పోచమల్లు , సంపత్ , సురేష్ తదితరులు పాల్గొన్నారు.