వేములవాడ రాజన్నకు ' వెలిచాల ' పది లక్షల విరాళం

తెలంగాణలోనే ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు రూ.10లక్షల రూపాయల విరాళాన్ని అందించారు.కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు.

 Velichala Donates Ten Lakhs To Vemulawada Rajanna, Velichala, Donates Ten Lakhs-TeluguStop.com

తాను దేవస్థానానికి ఉడతా భక్తిగా రూ.10 లక్షల రూపాయలు విరాళాన్ని అందిస్తానని తెలిపారు.ఇచ్చిన మాట ప్రకారంఈ మేరకు బుధవారం రోజున వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ఆలయ అధి కారులకు రూ.10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు, ఆలయ సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube