అవిసెలు (flax seeds)… వీటి గురించి మీరు వినే ఉంటారు.ఇప్పటి తరం వారికైతే చాలా మందికి వీటి గురించి తెలియదు.
కానీ ఒకప్పుడు వీటిని మన పూర్వీకులు ఎక్కువగా తమ ఆహారంలో తీసుకునే వారు.దీంతో వారు ఇప్పటికీ చాలా పుష్టిగా, ఆరోగ్యంగా ఉన్నారు.
కానీ మనమే వాటి గురించి మరిచిపోయాం.అయితే మీకు తెలుసా.? అవిసెలను మనం నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని.అవును, మీరు విన్నది కరెక్టే.
ఒక గుప్పెడు అవిసెలను డైరెక్ట్‌గా లేదా కొద్దిగా వేయించి నిత్యం ఏదో ఒక సమయంలో తీసుకుంటే దాంతో మనకు అనేక లాభాలు కలుగుతాయి.అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1.అవిసె గింజల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి.
నాన్ వెజ్ తినలేని వారు వీటిని రోజూ తింటే సరైన స్థాయిలో మాంసకృత్తులు లభిస్తాయి.దీంతో కీళ్లు, ఎముకలు దృఢంగా మారిపోతాయి.
నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి.
![](https://TeluguStop.com/wp-content/uploads/2018/06/Flax-Seeds-forDiabetes.jpg)
2.అవిసెల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉన్నాయి.ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.
ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి.ఆస్తమా వంటి అనారోగ్యాలు ఉన్నవారికి అవిసెలు చాలా మేలు చేస్తాయి.
3.అవిసె గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగానే ఉన్నాయి.ఇవి శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలను బయటకి పంపేస్తాయి.లివర్ సమస్యలు తొలగిపోతాయి.
4.నిత్యం కొన్ని అవిసె గింజలను తింటుంటే మహిళలకు రుతుక్రమంలో వచ్చే నొప్పి తగ్గుతుంది.ఈ గింజల్లో ఉండే ఫైటోఈస్ట్రోజెన్స్ మహిళల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
5.మధుమేహ వ్యాధి గ్రస్తులకు అవిసెలు వరమనే చెప్పవచ్చు.ఎందుకంటే వీటిని తినడం వల్ల మధుమేహ రోగగ్రస్తుల్లో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి.దీని వల్ల మధుమేహం సమస్య నుంచి బయట పడవచ్చు.
6.రక్తహీనతతో బాధపడే వారికి అవిసెలు మంచి ఆహారం.నిత్యం వీటిని తీసుకుంటే ఎర్రరక్త కణాల సంఖ్య పెరగడమే కాదు, రక్తహీనత కూడా పోతుంది.
7.అవిసెలను తినడం వల్ల శరీరంలో ఎల్లప్పుడూ ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి.దీని వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది.
8.గుండె సంబంధ సమస్యలు తొలగిపోతాయి.అవిసెలను తినడం వల్ల రక్త నాళాల్లో పేరుకుపోయిన కొలెస్టరాల్ తగ్గుతుంది.
9.అవిసెల్లో ఉండే ఫైటోఈస్ట్రోజెన్స్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి.క్యాన్సర్ కణాల పెరుగుదలకు వ్యతిరేకంగా పోరాడుతాయి.