ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల పోలీస్ పరిశీలకురాలు వినిత సాహు అన్నారు.ఈ రోజు తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయనున్న సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి పరిశీలించి కౌంటింగ్ కేంద్రాలు వాటి స్థితి గతులు, భౌగోళిక పరిస్థితుల గురించి ,భద్రత చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

 Tight Security At Votes Counting Centers Police Observer Vinitha Sahu, Security-TeluguStop.com

కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికాతో ఈవీఎం లను భద్రపరిచే స్ట్రాంగ్ రూం ఏర్పాట్లు , ఫైర్ సేఫ్టీ చర్యలు,కౌంటింగ్ రూమ్ ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు, కౌంటింగ్ హాల్ కు ఎంట్రీ, ఎగ్జిట్ ఉండాలని రెండు వైపులా పోలీస్ గార్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

వీరి వెంట డిఎస్పీ ఉదయ్ రెడ్డి, సి.ఐ సధన్ కుమార్ సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube