ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల పోలీస్ పరిశీలకురాలు వినిత సాహు అన్నారు.

ఈ రోజు తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయనున్న సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి పరిశీలించి కౌంటింగ్ కేంద్రాలు వాటి స్థితి గతులు, భౌగోళిక పరిస్థితుల గురించి ,భద్రత చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికాతో ఈవీఎం లను భద్రపరిచే స్ట్రాంగ్ రూం ఏర్పాట్లు , ఫైర్ సేఫ్టీ చర్యలు,కౌంటింగ్ రూమ్ ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు, కౌంటింగ్ హాల్ కు ఎంట్రీ, ఎగ్జిట్ ఉండాలని రెండు వైపులా పోలీస్ గార్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

వీరి వెంట డిఎస్పీ ఉదయ్ రెడ్డి, సి.ఐ సధన్ కుమార్ సిబ్బంది ఉన్నారు.

భారతీయ ముఠాల మధ్య ఆధిపత్య పోరు .. కెనడాలో ఇద్దరి హత్య, కోర్ట్ సంచలన తీర్పు