రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని విగ్రహాల మూలమలుపు వద్ద అతివేగం కారణంగా ఓ కారు సైడ్ డివైడర్ ను ఢీ కొట్టడంతో నుజ్జునుజ్జుయ్యింది.కారులో డ్రైవర్ తప్ప ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పంది.
డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







