భారత్‌కు నిత్యం చైనా, పాకిస్తాన్‌లతో( China , Pakistan ) సరిహద్దు ఘర్షణలు తలెత్తుతున్నాయి.దాయాది దేశాలు మన దేశంపై దురాక్రమణకు పాల్పడుతున్నాయి.
వాటిని మన బలగాలు కూడా ధీటుగా తిప్పికొడుతున్నాయి.గతంలో యూపీయే హయాంలో కాస్త మెతక వైఖరి అవలంబించినా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
చర్యకు ప్రతిచర్య అనే తరహాలో భారత బలగాలు వ్యవహరిస్తున్నాయి.ఇదే విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్( Jai Shankar ) తాజాగా స్పష్టం చేశారు.
చైనా, పాకిస్థాన్‌లకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.ఇది నయా భారత్ అని, తమను కవ్విస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
సరిహద్దుల్లో తమను కవ్వించే చర్యలు మానుకోవాలని హితవు పలికారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

దశాబ్దాలుగా భారత్‌పై సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న శక్తులకు ఇది భిన్నమైన భారత్ అని ఇప్పుడు తెలుసని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.ఉగాండాలోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి జైశంకర్ మాట్లాడారు.సరిహద్దుల్లో భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి జైశంకర్ స్పందించారు.ఉగ్రవాదానికి పాల్పడే శక్తులకు భారత్ ధీటుగా స్పందిస్తుందన్నారు.చర్యకు ప్రతిచర్య తప్పదని, ఇది ఇంతకు ముందున్న భారత్ కాదని తెలుసుకోవాలన్నారు.చైనాతో సరిహద్దులో ఉన్న సవాళ్ల గురించి కూడా ఆయన మాట్లాడారు.
గత మూడేళ్లుగా సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా పెద్దఎత్తున బలగాలను బోర్డర్‌కు తీసుకొచ్చిందన్నారు.నేడు భారత సైన్యం ( Indian Army )చాలా ఎత్తులో, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో మోహరింపబడిందని ఆయన గుర్తు చేశారు.
భారతీయ సైనికులకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందన్నారు.వారికి సరైన పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.
గతంలో బోర్డర్ వద్ద పరిస్థితులను నిర్లక్ష్యం చేశారన్నారు.ఈ తరుణంలో చైనాతో సరిహద్దులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత కృషి చేయాల్సి ఉందని ఆయన అంగీకరించారు.







