రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో చెట్ల నరికివేత మళ్లీ ప్రారంభమైంది.మండల కేంద్రం నుంచి మండలంలోని గైదిగుట్ట వెళ్లే ప్రధాన రహదారి వెంట ఉన్న అటవీ ప్రాంతంలో
ఏడాది క్రితమే 50 పైగా ఎకరాల్లో నేల మట్టం చేశారు.
మళ్లీ రెండు, మూడు రోజులుగా చెట్లను కోసి మిషన్లతో భారీ వృక్షాలను నేలమట్టం చేస్తున్నారు.పోడు భూములపై దురాశ చెట్ల నరికివేతకు కారణమవుతోంది.