తూముకు మరమ్మతులు చేపట్టిన అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని నాగారం చెరువు రిజర్వాయర్ తూము గత కొన్ని రోజులుగా బిగుసుకుపోయి నీరు లీకు అవుతున్న విషయం తెలిసిందే.దీంతో ఈ విషయాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ కు రైతులు ప్రజలు తెలుపగ.

 Officials Who Undertook Repairs To The Dam, Repairs To Dam, Rudrangi Mandal, Ra-TeluguStop.com

దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్ మరమ్మత్తులు చేయవలసిందిగా ఇరిగేషన్ అధికారులు ఆదేశించారు.

స్పందించిన అధికారులు నాగారం చెరువు తూములను పరిశీలించిన బిగిసుకుపోయిన నాగారం చెరువు తూముకు మరమ్మతులు చేసి నీరు లీకు కాకుండా చేశారు.

వేసవి సమయంలో పంటలకు నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు నీటి విడుదలకు వీలు ఉండేలా చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు గ్రామ రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు,మత్స్యకారులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube