నకిలి భూమి పట్టా పాసు బుక్ లు తయారు చేసి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్,రిమాండ్ కి తరలింపు:సి.ఐ వెంకటేశ్వర్లు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట్( Konaraopet ) ఎమ్మార్వో ఆఫీసులో పని సుంకరి గా పనిచేసి, భూమి రికార్డ్ లకు సంబందించి అనుభవం సంపాదించి రెవెన్యూ అధికారులతో సంబందాలున్నాయని ప్రజలను నమ్మించి నకిలి పాస్ బుక్ తయారు చేసి, భూములు ఆన్లైన్ చేస్తానని మోసాలకు పాల్పడుతున్న ముస్కురి కాశీరామ్ ని కోనరావుపేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు సి.ఐ తెలిపారు.

 A Person Who Is Committing Fraud By Making Fake Land Patta Pass Books Has Been A-TeluguStop.com

ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ…కోనరావుపేట గ్రామానికి చెందిన ముస్కురి కాశీరామ్ తండ్రి లక్ష్మీరాజం, అనే వ్యక్తి గతములో కోనరావుపేట ఎమ్మార్వో ఆఫీసులో పని సుంకరి గా పనిచేసి, భూమి రికార్డ్ లకు సంబందించి అనుభవం సంపాదించి, తనకు రెవెన్యూ అధికారులతో సంబందాలున్నాయని కోనరావుపేట గ్రామస్తుడయిన దండుగుల కనకయ్య తండ్రి రాజయ్య అనే వ్యక్తికి ప్రభుత్వ భూమి పొందడానికి సహాయం చేస్తానని, 3 ఎకరాలకు పట్టా పాసు పుస్తకం చేసి ఇస్తానని, భూమిని చూపిస్తానని నమ్మించి అతడి వద్ద ఒక లక్ష రూపాయలు తీసుకొని అతడి భార్య దండుగుల పోషవ్వ పేరు మీద కోనరావుపేట గ్రామ శివారులోని సర్వే నంబరు 367 లో 3 ఎకరాల భూమి ఉన్నట్టుగా ఒక పాత రకం పట్టా పాసు బుక్ ను, నకిలీ ముద్రలు ఉపయోగించి నకిలీ పాస్ పుస్తకాలు తయారుచేసి ఇచ్చినాడని, తర్వాత దండుగుల కనుకయ్య సుమారు 2 సంవత్సరాల కిందట అతడు చూపెట్టిన చోట కోనరావుపేట గ్రామoలో భూమిని సాగు చేస్కుంటు ఉండగా ఫారెస్ట్ అధికారులు వచ్చి, అది ఫారెస్ట్ భూమి అని చెప్పి వెల్లగొట్టినారని, అతడిని ఆడగగా దానితో తనకు సంబందం లేదని, తీసుకున్న పైసల క్రిందకు పాసు పుస్తకం ఇచ్చినానని, ఇంకోసారి అట్టి డబ్బులు అదిగితే నిన్ను, నీ కుటుంబ సభ్యులను చంపివేస్తానని బెదిరించినాడని, తరువాత అతడు జనవరి 2024 లో కొత్త ప్రభుత్వం వచ్చిందని ధరణి( Dharani ) లో మార్పులు చేస్తున్నారని నమ్మించి ఇంకొ 20 వేల రూపాయలు ఇస్తే అట్టి భూమిని ధరణిలో నమోదు చేపిస్తానని లేదంటే ఎప్పటికీ నీ భూమి ధరణిలోకి రాకుండా చెపిస్తానని కనుకయ్యాను బెదిరించి మరో 10 వేల రూపాయలు తీసుకొని కనుకయ్యని మోసాగించినాడని, సదరు కాశీరామ్ అను వ్యక్తి పలువురు వ్యక్తులకు ఇదే విదంగా నకిలీపట్టా పాసు బుక్ లు తయారుచేసి ఇచ్చినాడని మండలానికి చెందిన పలువురు రైతుల నుండి భూములు ఆన్లైన్ చేయిస్తానని మోసపూరిత మాటలు చెప్పి బలవంతపు వసూళ్లకు పాల్పడినాడని సమాచారం రాగా, మాస్కురి కాశిరామ్ అను వ్యక్తిపై కేసు నమోదు చేసి, అతడి వద్ద నుండి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు చెందిన (10) పట్టాదార్ పాస్ బుక్ లు, (06) టైటిల్ డీడ్ బుక్ లు మొదలగునవి పంచుల సమక్షంలో సీజ్ చేసి, విచారణలో సరైన ఆధారాలు లభించినందున అతడిని రిమాండ్ కు పంపడం జరిగిందని, మాస్కురి కాశిరామ్ వల్ల మోసపోయిన బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే పోలీసు వారిని సంప్రదించలని సి.ఐ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube