భవన నిర్మాణ కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిచే సి ఎస్ సి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో రిజిస్టర్ చేసుకున్న కార్మికులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.డిస్టిక్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ…ఈ శిబిరంలో సుమారు 19 రకాల టెస్టులు 50 రకాల ఫలితాలు పొందుతామని కార్మికుని యొక్క వయసుతో బరువు, ఎత్తు, బిపి, షుగర్, కంటి పరీక్ష, రక్త పరీక్షలు: సి బి పి, థైరాయిడ్, క్యాన్సర్, లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్ ఎఫ్ టి), రీనల్ ఫంక్షన్ టెస్ట్ (ఆర్ ఎఫ్ టి),

 Free Medical Checkups For Construction Workers At Boppapur Village, Free Medical-TeluguStop.com

విటమిన్ బి12, డి 3, బ్లడ్ గ్రూప్, హెచ్ఐవి, హెచ్ బి ఎస్ ఏజి,,హెచ్ సి వి , వి డి ఆర్ ఎల్ పల్మనరి ఫంక్షన్ టెస్ట్ ( పి ఎఫ్ టి) గుండెకు సంబంధించిన ఈసీజీ, యూరిన్ టెస్ట్ తదితర పరీక్షలు కార్మికులకు చేయనున్నారు అని కార్మికుడు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే అది ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడే విధంగా ఇట్టి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైద్యులు హరిప్రసాద్, క్యాంప్ కోఆర్డినేటర్ మహేందర్, క్యాంపు సభ్యులు విజేందర్, వేణు కుమార్, అభిషేక్, వంశీ, తిరుపతి, చరణ్, శైవాజ్, అఖిల, మమత, నీలోఫర్ ఖాన్ కార్మికులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube