ప్రజల్లో నమ్మకం,భద్రత పై విశ్వాసం కలిగించేందుకు విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాయంలో గురువారం జిల్లా పోలీసు అధికారులతో అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ.అందులో భాగంగా గడిచిన ఆరు నెలల్లో పోలీస్ స్టేషన్ల యెక్క పని తీరు,యు ఐ కేసుల డిస్పోజల్,పెండింగ్ ,లాంగ్ పెండింగ్‌లో ఉన్న యు ఐ కేసుల పరిష్కారం పై, ఎస్సీ/ ఎస్టి విమెన్ ఎగైనెస్ట్ కేసులు, పోక్సో కేసుల, కన్వెన్షన్స్,ఫంక్షనల్ వర్టీకల్స్ పై,విలేజ్ సీసీటీవీ ప్రొజెక్ట్ ద్వారా గ్రామాల వారీగా సిసి కెమెరాల ఏర్పాటు, గంజాయి,పిడిఎస్ రైస్,నకిలీ విత్తనాల అక్రమ రవాణా,షీ టీమ్‌లు పనితీరు,సైబర్ క్రైమ్ కేసుల పురోగతి,ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్,లకు సంబందించిన కేసుల తీసుకుంటున్న చర్యలపై పోలీస్ అధికారులతో సమీక్షా నిర్వహించిన జిల్లా ఎస్పీ.

 Visible Policing Should Be Implemented To Instill Trust And Confidence In Public-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం,భద్రత పై విశ్వాసం కలిగించేందుకు విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలని, పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రతి ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి చట్ట ప్రకారం న్యాయం చేయాలని అన్నారు.పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపించి వాటి సంఖ్యను తగించేలా కృషి చేయాలని,ఇందుకోసం కోర్టులలో న్యాయమూర్తులతో చర్చించి కేసుల పురోగతి, విచారణ విషయాలలో అధికారులంతా చురుకుగా పని చేయాలని సూచించారు.

కోర్టు కేసులలో శిక్షల శాతం మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.ఎస్సీ/ ఎస్టీ ఉమెన్ ఎగైనెస్ట్ కేసులలో, పోక్సో కేసులలో విచారణ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులని ఆదేశించారు.

అసాంఘిక కార్యకలాపాలపై పటిష్ట నిఘా.చట్టవ్యతిరేక కార్యక్రమాలు అయిన గంజాయి,గుడుంబా, పేకాట,పిడిఎస్ రైస్,నకిలీ విత్తనాలు,అక్రమ ఇసుక రవాణా వంటి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచి దాడులు నిర్వహించి వాటి నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు.

గడిచిన ఆరు నెలల్లో జిల్లాలో అక్రమ గంజాయిపై 21 కేసులు నమోదు చేయడం జరిగిందని, అక్రమంగా ప్రభుత్వ రేషన్ బియ్యం తరలిస్తున్న వారిపై 23 కేసులు నమోదు జరిగింది అని,నకిలి విత్తనాలు అక్రమ రవాణా చేసే వారిపై ఒక కేసు నమోదు చేయడం జరిగిందని, జిల్లాలో అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై 267 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై పటిష్ట నిఘావ్యవస్థ ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

నేరస్తులకు శిక్షలు పడటంపై ప్రత్యేక దృష్టి.జిల్లాలో నేరస్తులకు కోర్టులో శిక్షలు పడటంతో ప్రత్యేక దృష్టి పెట్టినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు.

జిల్లా పరిధిలో గడిచిన ఆరు నెలల్లో 20 కేసుల్లో జైలు శిక్ష పడ్డాయి అందులో 02 కేసుల్లో జీవిత ఖైదు పడగ,06 కేసుల్లో ఒక సంవత్సరం జైలు శిక్ష పడ్డాయి,149 కేసుల్లో గౌరవ కోర్ట్ జరిమానాలు విధించాయి.అదేవిధంగా ఒకరిమిద పిడి యాక్ట్ నమోదు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

సి ఈ ఐ ఆర్ అప్లికేషన్.మొబైల్ పోయినా లేదా దొంగిలించిన బడిన బాధితులు సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో జిల్లా పరిధిలో 404 ఫిర్యాదు చేయగా అందులో 100 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగింది.

రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి.జిల్లా నందు రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ఏవిధమైన చర్యలను తీసుకోవడం వలన ప్రమాదాలు తగ్గుతాయో అధికారులతో చర్చించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాలు వేగాన్ని నియంత్రించడానికి రోడ్ల పై భారీ కేడ్స్ ను పెట్టాలన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

గడిచిన 6 నెలల కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 3405,ఇ-పెట్టి కేసులు 1849, నమోదు చేయడం జరిగింది అన్నారు.ప్రతి వాహన దారుడు రోడ్ భద్రత ,ట్రాఫిక్ నియమాలు పాటించే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు.నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలకం అని కమ్యూనిటీ పోలీసింగ్ లో , మినిమమ్ ఫోర్ సీసీటీవీ కెమెరాస్ ఫర్ విలేజ్ ప్రొజెక్ట్ లో భాగంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసే విధముగా ప్రజలను అవగాహన పరుస్తూ సిసి కెమెరాల ఏర్పాటుకు మరింత ప్రోత్సహించే విధంగా అందరు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.

తెలంగాణ పోలీస్ శాఖ అమలు పరుస్తున్న ఫంక్షనల్ వర్టీకల్స్ సమర్ధవంతంగా అమలు చేస్తూ ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని,గత నెలలో విధులలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 33 మంది పోలీస్ అధికారులకు, సిబ్బంది కి ప్రశంశ పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు విశ్వప్రసాద్, నాగేంద్రచారి, సి.ఐ లు,ఆర్.ఐ లు ,ఎస్.

ఐ లు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube