డ్రాలో పేర్లు రాని పేదలందరికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షలుఇవ్వాలి.సిరిసిల్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య* రాజన్న సిరిసిల్ల జిల్లా చార్మినార్ టైమ్స్ ప్రతినిధి మార్చి 4 : కమ్యూనిస్టులు నిర్మించిన భూపోరాటాల వల్లే పేదలకు కొద్దో గొప్పో ఆత్మగౌరవాన్ని పెంచిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు.శనివారం సిరిసిల్ల నెహ్రు నగర్ భవాని ఫంక్షన్ హాల్ లో సీపీఎం ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన సదస్సును సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ సిరిసిల్ల లో ఇల్లులేని పేదలందరికి ఇల్లు నిర్మించుకోవడానికి 5లక్షల రూ లు ఇవ్వాలని డ్రా లో పేర్లు రాని 963మందికి తక్షణమే డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలన్నారు .ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధనకు దశల వారి గా నిర్మించిన పోరాటాలు అభినందనీయమన్నారు.
డబుల్ బెడ్ రూమ్ డ్రాలో పేర్లు రాని వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు సీపీఎం పేదలకు అండగా నిలుస్తుందన్నారు.
వారికి ఇంటి స్థలం పట్టా ఇచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని తొందరలోనే సమస్య పరిష్కారం జరిగేలా చేస్తాం అని జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ తహశీల్దార్ లు పలుమార్లు పేదలకు వాగ్దానం చేశారని చెప్పారు.ఇచ్చిన ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలన్నారు.
బీజేపీ నేతలు రోజు గొప్పలు చెప్పడం, మాట్లాడడం తప్ప పేదల ఇండ్ల స్థలాలకు నయాపైసా ఇవ్వలేదన్నారు.పైగా పేదల నడ్డివిరిచే విధంగా ధరలు విపరీతంగా పెంచుతున్నారని అన్నారు.
కోటీశ్వరులకు రాయితీలు పేదలపై భారాలు మోపుతుందన్నారు.గ్యాస్ ధర 2014 లో 465రూ.
లు ఉండగా 1200కి ఎగబాకిందన్నారు.కానీ కోటీశ్వర్లకు మాత్రం 10శాతం రాయితీ ఇచ్చిందన్నారు.
ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పోరాట సాధన సదస్సులో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు, జగదీష్ లు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి,కోడం రమణ, సూరం పద్మ , నక్క దేవదాస్ రాజశేఖర్, పోచమల్లు,సురేష్, గోవింద్ లక్ష్మణ్ ,సామల కవిత , గట్ల స్వప్న, లావణ్య తదితరులు పాల్గొన్నారు.







