బాధిత కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయంఅందచేత

మట్టిపెళ్ళలు పడి మృతి చెందిన మహిళ కుటుంబానికి అందజేత రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన మారుపాక రాజవ్వ (48) ప్రమాదవశాత్తు మృతిచెందగా, బాధిత కుటుంబానికి (కుమారుడు మారుపాక బాలకిషన్) కు రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ నెల 21 వ తేదీన మంగళవారం కోనరావుపేట మండలం వెంకట్రావుపేట లోని కేశవరావు చెరువులో ఉపాధి హామీ పనికి గ్రామానికి చెందిన కూలీలు వెళ్ళారు.ఈ క్రమంలో చెరువు నుంచి తొలగించిన మట్టిని ట్రాక్టర్ లోకి ఎత్తి ఆ ప్రదేశంలోనే కూర్చున్నారు.

 Financial Assistance Of Rs.50 Thousand To The Affected Family , Rs.50 Thousand,-TeluguStop.com

ప్రమాదవశాత్తు మట్టి పెళ్ళలు వారిపై కూలగా, మారుపాక రాజవ్వ (48), మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి.వారందరినీ సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు.తీవ్రంగా గాయపడిన రాజవ్వ మృతి చెందింది.మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం యాక్ట్ 2005 రూల్స్ ప్రకారం రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కు గాను ప్రభుత్వం తరుపున ఉపాధి హామీ అధికారులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సహాయం గా వారి కుటుంబానికి మరుసటి రోజు తేదీ 22.5.24 నాడు రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసారు.మిగిలిన ఒక లక్ష 50 వేల రూపాయలు త్వరలో అందజేయగలమని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube