టీపీటీఎఫ్ గజ్వేల్ విద్యా సదస్సును విజయవంతం చేద్దాం

రాజన్న సిరిసిల్ల జిల్లా: తేది: 16 ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుండి గజ్వెల్ లో మహతి ఆడిటోరియం లో జరిగే టీపీటీఎఫ్ విద్యా సదస్సును విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దోర్నాల భూపాల్ రెడ్డి, దుమాల రమానాథ రెడ్డి లు పిలుపు నిచ్చారు.ఈ సందర్భముగా జిల్లా నాయకులతో కలిసి విద్యా సదస్సు పోస్టర్ నీ స్థానిక శివనగర్ ఉన్నత పాఠశాల లో ఆవిష్కరించారు.

 Lets Make Tptf Gajwel Education Conference A Success, Tptf ,gajwel, Education C-TeluguStop.com

ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ టీపీటీఎఫ్ అధికార మాస పత్రిక ప్రధాన సంపాదకులు ప్రకాష్ రావు పదవీ విరమణ సందర్భముగా గజ్వేల్ లో విద్యా సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఇందులో మొదటి అంశంగా సంక్షోభంలో సామాజిక విలువలు అంశం పై “వక్త”గా ప్రొఫెసర్ సి.ఖాసీం, ఓయూ హైద్రాబాద్, 2వ అంశం: విద్యారంగ సంక్షోభం – కర్తవ్యాలు అనే అంశం పై “వక్త” ఏపీటీఎఫ్ పూర్వ అధ్యక్షులు ఏ నర్సింహారెడ్డి లు ఉపన్యసిస్తారని అన్నారు.

ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు వై.అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి పి.నాగిరెడ్డి హాజరవుతున్నారని అన్నారు.ఇట్టి విద్యా సదస్సుకు జిల్లాలోని ఉపాధ్యాయులు పెద్ద మొత్తంలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమం లో సీనియర్ ఉద్యమ నాయకులు ఏ.రామచంద్రం, జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు భూపాల్ రెడ్డి, రమానాద్ రెడ్డి, జిహెచ్ఎం మోతీలాల్,జిల్లా ఉపాధ్యక్షులు పురం వాసుదేవరావు, మళ్ళారపు పురుషోత్తం, సత్తు రవీందర్, నాయకులు బుస రాజేందర్, మైలారం తిరుపతి, మహమూద్, లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్ రాజు, చంద్ర శేఖర్, రాంబాబు, శ్రీనివాస్, మధుసూదన్, నరేందర్ గజ్వేల్ కౌన్సిలర్, పి .ఎల్లయ్య జిల్లా కౌన్సిలర్, మహమూద్ జిల్లా కార్యదర్శి, భాస్కర్ జాగ్దేవపూర్ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube