వైరల్: ఆగి ఉన్న రైలులో చెలరేగిన మంటలు.. భయాందోళనలో ప్రజలు..

గురువారం ఉదయం సికింద్రాబాద్ మెట్టుగూడ రైల్వే స్టేషన్( Secunderabad Mettuguda Railway Station ) దగ్గరలోని ఓ రైలులో రెండు భోగిల్లో ఉన్నపలంగా మంటలు చెలరేగాయి.నిలిచి ఉన్న భోగిలనుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

 People Are In Panic After The Fire Broke Out In The Viral Stopped Train, Viral V-TeluguStop.com

భోగిల నుంచి వెలబడే మండల ద్వారా భారీగా పొగ కమ్ముకోవడంతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఇబ్బందులు పడ్డారు.అయితే కొద్దిసేపటి తరువాత మంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకొని స్థానిక ప్రజలు మొదటగా పోలీసులకు సమాచారం అందించారు.

రైలు వాషింగ్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అదనపు ఏసీ బోగీలలో ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అయినట్టుగా అర్థమవుతుంది.

ఈ విషయంపై వెంటనే స్పందించిన రైల్వే అధికారులు( Railway official )దట్టమైన మంటల వల్ల ఏర్పడ్డ పొగలను అదుపు చేశారు.రైలు వాషింగ్ కోసం వెళ్లి తిరిగి ప్లాట్ఫామ్ మీదకి వస్తున్న అదనపు ఏసీ బోగీలో ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.ఈ సమయంలో రైలులో ఎటువంటి ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

మెట్టుగూడ వాషింగ్ లైన్ లో ఆగి ఉన్న రైలులోని ఏసి బోగీలో ఏర్పడిన మంటలపై సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం( South Central Railway GM ) ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు.ఈ విషయం తెలుసుకున్న అధికారులు కూడా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అక్కడేం జరిగిందో గమనించారు.ఇక ప్రస్తుతం అధికారులు అసలు బోగీలో ఎందుకు షార్ట్ సర్క్యూట్ జరిగిందన్న కారణాలు ఆరా తీస్తున్నారు.క్లీనింగ్ కు వెళ్లి వచ్చిన తర్వాత రైల్వే భోగిలో మంటలు చిలరేగక ముందు ఎవరైనా క్లీనింగ్ సిబ్బంది అందులో ఉన్నారన్న విషయంపై కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఇంకోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube