సాధారణంగా మనం చేసే దానాలు మనకు మంచిని కలుగజేస్తాయి.అయితే దానాలలో కూడా కొన్నింటిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికీ దానం చేయకూడదు.
ఆ విధంగా దానం చేయడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.అయితే తెలుగు నెలలో ఎంతో పవిత్రమైన మాఘ మాసంలో దానధర్మాలు చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ మాఘ మాసంలో దానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.అయితే మాఘ మాసంలో ఏ దానాలు చేయాలి ఇక్కడ తెలుసుకుందాం.
మాఘమాసంలో వచ్చే శుక్ల సప్తమి నాడు గుమ్మడికాయను దానం చేయాలి.అదేవిధంగా శుక్ల పక్ష చతుర్దశి నాడు వస్త్రాలు, దుప్పట్లు, పాదరక్షలను దానం చేయటం వల్ల బ్రతికున్నంత కాలం సుఖసంతోషాలు కలుగుతాయి.
మరణాంతరం నరక ప్రాప్తి కలగకుండా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతారు.అదే విధంగా ఎంతో పవిత్రమైన మాఘమాసంలో చెరుకురసం, ఉసిరికాయను దానం చేయడం కూడా శుభపరిణామం.

పవిత్రమైన మాఘమాసంలో బంగారు తులసిదళం దానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి.అదేవిధంగా ఈ సాలగ్రామాన్ని దానంగా తీసుకున్నవారు, ఇచ్చినవారు సుఖ సంతోషాలతో గడుపుతారు.ఈ నెలలో పేదలకు అన్నదానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.అయితే అందరికీ నెల మొత్తం దానం చేసే స్తోమత ఉండదు కాబట్టి ఈ నెలలో ఏదో ఒక రోజు అన్నదానం చేయటం వల్ల పుణ్య ఫలాన్ని పొందుతారు.
రాగిపాత్రలో లేదా కంచు పాత్రలు నల్లటి నువ్వులను పోసి బంగారం తో సహా దానం చేయడం వల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.ఈ విధంగా నల్లటి నువ్వులు, బంగారం కలిసి దానం చేయడం వల్ల త్రివిధ పాపాలు సైతం తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.