మాస్ మహారాజ్ రవితేజ ( Ravi Teja )ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.రావణాసుర( ravanasura ) సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా రవితేజ మళ్లీ పారితోషికం పెంచేయడం సోషల్ మీడియా( Social media) వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
కొన్ని నెలల క్రితం వరకు 20 నుంచి 22 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకున్న మాస్ మహారాజ్ ప్రస్తుతం ఆ మొత్తాన్ని 25 కోట్ల రూపాయలకు పెంచేశారని తెలుస్తోంది.

రవితేజ పారితోషికంను ఊహించని స్థాయిలో పెంచడంతో ఫ్యాన్స్ సైతం ఒకింత షాకవుతున్నారు.రవితేజ పారితోషికం పెంచడం వల్ల కొన్ని సినిమాలు బ్రేక్ ఈవెన్ కావడంలో కూడా ఫెయిల్ అవుతున్న సంగతి తెలిసిందే.రవితేజ చేతిలో ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswara Rao )సినిమాతో పాటు ఈగిల్ సినిమా ఉంది.
కలర్ ఫోటో ఫేమ్ సందీప్ ( Sandeep )డైరెక్షన్ లో రవితేజ హీరోగా మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
సందీప్ గురుశిష్యుల కథను తయారు చేశారని ఈ సినిమాలో మరో కీలక పాత్రలో శర్వానంద్ ( sharwanand )నటించే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది.
రవితేజకు డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పడానికి ఆయన రెమ్యునరేషన్ ఉదాహరణ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.రవితేజ వయస్సు పెరుగుతుండగా అదే సమయంలో రెమ్యునరేషన్ ను మార్కెట్ ను మించి పెంచుతున్నారు.

గత కొన్నేళ్లలో రవితేజ నటించిన సినిమాలలో ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంది.పలు సినిమాల ప్రొడక్షన్ లో రవితేజ ఇన్వెస్ట్ చేయగా ఆ సినిమాలు సైతం రవితేజకు భారీ షాకిచ్చాయి.రాబోయే రోజుల్లో రవితేజకు వరుస విజయాలు దక్కుతాయేమో చూడాల్సి ఉంది.మాస్ మహారాజ్( Mass Maharaj ) రవితేజ కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.







