సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ సినిమాలపై మక్కువతో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ తన నటన సామర్ధ్యాన్ని నిరూపించుకుంటూ హీరోగా అవకాశాలు అందుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ( Vijay Devarakonda).ఇలా చిన్న పాత్రలే అని ఆ పాత్రలను వదులుకోకుండా చిన్న పాత్రలలో నటిస్తూ అనంతరం పెళ్లి చూపులు( pelli chupulu ) సినిమా ద్వారా హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు.
ఈ సినిమా తర్వాత గీతగోవిందం అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ సినిమాలు ఈయనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చాయి.ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడమే కాకుండా ప్రస్తుతం భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది.

ఇక విజయ్ దేవరకొండ నేడు ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు అంటే దాని వెనుక కష్టం చాలానే ఉందని చెప్పాలి.ఒకానొక సమయంలో ఒక చిన్న అవసరం కోసం పదివేల రూపాయలకు ఎంతో కష్టపడిన ఈయన నేడు కొన్ని కోట్లకు అధిపతి అని చెప్పాలి.ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు దాదాపు 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.ఇలా సినిమాలలో వరుస సినిమాలతో బిజీ అవ్వడమే కాకుండా ఈయన వ్యాపార రంగంలో కూడా ముందుకు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

రౌడీ పేరుతో ఈయన వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు.మార్కెట్లో ఈయన బ్రాండ్ కు చాలా మంచి వాల్యూ కూడా ఉందని చెప్పాలి.ఇలా బిజినెస్ మెన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ నిర్మాతగా కూడా స్థిరపడ్డారు.ఇలా తన నిర్మాణంలో కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ ఈయన ఇండస్ట్రీలోకి స్వాగతం పలుకుతున్నారు.
ఇక విజయ్ దేవరకొండ ఆస్తుల విషయానికి వస్తే ఈయన పేరిట చాలా ఖరీదైన ఆస్తులు బంగ్లాలు ఉన్నాయని అలాగే ఈయన గ్యారేజ్లో ఖరీదైన కార్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది.పలు నివేదికల ప్రకారం విజయ్ దేవరకొండ ఆస్తి సుమారు 80 నుంచి 100 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి( Khushi ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.