భయపెడుతున్న కరోనా కౌంట్‌, ఇందుకే లాక్‌డౌన్‌ కంటిన్యూ

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు లక్షల్లో పెరుగుతున్నా ఇండియాలో మాత్రం వందల్లోనే కౌంట్‌ ఉందని ఇన్నాళ్లు అనుకున్నాం.కాని గడిచిన 24 గంటల్లో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు అవ్వడంతో టెన్షన్‌ మొదలయ్యింది.

 Afraid Of Corona Cases Count That's Why Contuine The Lock Down, Corona Virus, In-TeluguStop.com

లాక్‌డౌన్‌ ముగించే సమయానికి కరోనా కౌంట్‌ తగ్గుతుందని అంతా భావించారు.కాని అనూహ్యంగా కరోనా వైరస్‌ వందల నుండి వేలల్లోకి కౌంట్‌ పెరుగుతోంది.

పది వేలకు క్రాస్‌ అయిన ఈ సంఖ్య ముందు ముందు మరెంత దూరం వరకు వెళ్తుందో అని ఆందోళన వ్యక్తం అవుతోంది.

వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ సమయంలోనే లాక్‌డౌన్‌ మళ్లీ కొనసాగిస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.కరోనా కౌంట్‌ ఈ లెక్కన పెరిగితే మరింత కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆందోళన వ్యక్తం అవుతోంది.

దేశంలో లాక్‌డౌన్‌ విధించినా కూడా ఈ స్థాయిలో కరోనా కేసులు పెరగడంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది.ప్రభుత్వమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube