GSLV-F10 రాకెట్ ప్రయోగం విఫలం..

GSLV-F10 రాకెట్ ప్రయోగం విఫలం.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV)-F10 ప్రయోగం విఫలమైంది.

 Gslv-f10 రాకెట్ ప్రయోగం విఫలం..-TeluguStop.com

జి ఎస్ ఎల్ ఎన్ వాహక నౌక ద్వారా జీఐశాట్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించిన గా క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య తలెత్తింది.దీంతో GSLV మిషన్ విఫలమైందని  ఇస్రో చైర్మన్ ప్రకటించారు.నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గురువారం ఉదయం 5.43 గంటలకు  శాస్త్రవేత్తలు ప్రయోగించారు.బుధవారం ఉదయం మూడు నలభై మూడు గంటలకు ఇది వాహకనౌక కౌంట్ డన్ ప్రారంభం అయ్యింది.

క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య  రావడంతో ప్రయోగం విఫలమయ్యింది.

దేశ భద్రత అవసరాలు రక్షణ వ్యవస్థ అనుసంధానం దేశంలో ఉపద్రవాలు విపత్తులు సంభవించినప్పుడు ముందు సమస్యలు తెలుసుకోవడం కోసం EOS-03 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని  ఉపయోగించాల్సి ఉంది.ఈ ఉపగ్రహంలో మల్టీ_ స్పెక్ట్రల్ షార్ట్ వేవ్- ఇన్ ప్రారెడ్ (256 బ్రాండ్) పేలోడ్స్ గా అమర్చారు.ఈ ఉపగ్రహం భూమికి 36వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి అత్యంత పవర్ ఫుల్ కెమెరాతో 50 మీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో భూమిపై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలు తీసి పంపించేందుకు రూపొందించారు.క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ వద్ద సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం విఫలం అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube