ఆ డైరెక్టర్ రోజుకు 150 సిగరెట్లు తాగేవారట.. చివరకు..?

సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిలో ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది.ఆ అలవాట్లలో కొన్ని మంచి అలవాట్లు ఉంటే మరికొన్ని చెడు అలవాట్లు ఉంటాయి.

 Star Director Who Smokes 150 Cigarettes A Day.15 Cigi Rattes , Asuran Director ,-TeluguStop.com

కోలీవుడ్ డైరెక్టర్ వెట్రి మారన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి వెట్రి మారన్ దర్శకుడిగా మంచి పేరును సొంతం చేసుకున్నారు.

తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన అసురన్ కు వెట్రిమారన్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే.

అయితే ఈ డైరెక్టర్ కు చిన్న వయస్సులోనే సిగరెట్ తాగే అలవాటు ఉండేదట.తాను షూటింగ్ లో ఉన్నా లేదా సినిమాకు సంబంధించిన ఏ పని చేస్తున్నా సిగరెట్ తాగుతూ ఉండేవడినని వెట్రిమారన్ వెల్లడించారు.

రోజుకు 150 సిగరెట్లు తాగిన రోజులు కూడా ఉన్నాయని వెట్రిమారన్ అన్నారు.అయితే ఆ అలవాటుకు తాను దూరం కావాల్సి వచ్చిందని వెట్రిమారన్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

Telugu Cigarettes, Asuran, Kollywood, Vetrimaran, Tollywood-Movie

గౌతమ్ వాసుదేవ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాను చూసిన తర్వాత తాను సిగరెట్లు మానేయాలని నిర్ణయం తీసుకున్నానని వెట్రిమారన్ చెప్పుకొచ్చారు.ఎంతోమంది జీవితాలను ఆ సినిమా మార్చిందని వెట్రిమారన్ తెలిపారు.ఆ సినిమా ఎంతోమందిని సెటిల్ అయ్యేలా చేసిందని గౌతమ్ వాసుదేవ మీనన్ చెప్పుకొచ్చారు.రోజుకు 150 సిగరెట్లను తాగే అలవాటు ఉన్న వ్యక్తి ఆ అలవాటును మానుకోవడం గమనార్హం.

Telugu Cigarettes, Asuran, Kollywood, Vetrimaran, Tollywood-Movie

ఒక డైరెక్టర్ వేరే డైరెక్టర్ సినిమాను ప్రశంసించడంతో పాటు ఆ సినిమా జీవితాన్ని మార్చేసిందని చెప్పడం గమనార్హం.వెట్రిమారన్ సిగరెట్ అలవాటును మానుకోవడం పెద్ద అచీవ్ మెంట్ అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దేశంలోని టాప్ డైరెక్టర్లలో ఒకరిగా వెట్రిమారన్ పేరు తెచ్చుకున్నారు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా ఎంతోమంది జీవితాలను మార్చడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube