ఏపీలో అధికారమే లక్ష్యంగా ఉన్న టీడీపీ( TDP ) వైసీపీని దెబ్బ తీసేందుకు గట్టి ప్రణాళికలు వేసిందా ? అందులో భాగంగానే వైసీపీ( YCP ) అసంతృప్త నేతలను ఆకర్శించేంకు చంద్రబాబు( Chandrababu Naidu ) ప్లాన్ చేస్తున్నారా ? అంటే అవుననే చెబుతున్నారు విశ్లేషకులు.ఇటీవల అధికార వైసీపీలో భారీగా మార్పులు చోటు చేసుకున్నా సంగతి తెలిసిందే.11 చోట్ల ఇంచార్జ్ ను ఏక కాలంలో మార్చారు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.( CM Jagan ) అయితే ఈ మార్పు వెనక ఆయన వ్యూహాలు ఎలా ఉన్నప్పటికి.
ఈ పరిణామాలను అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.
అనూహ్యంగా ఇంచార్జ్ ల మార్పుతో కొంతమందిలో సీట్ల భయం కూడా మొదలైంది.దాంతో పార్టీలో అసహనంగా ఉన్న నేతలకు చంద్రబాబు భరోసా కలిపిస్త టీడీపీలో చేర్చుకునే ప్రయత్నం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.ఇప్పటికే చాలమంది వైసీపీ రెబెల్ ఎమ్మేల్యేలు( YCP Rebel Mlas ) టీడీపీతో టచ్ లో ఉన్నారట.
ఆ మద్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేలలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారు ఇప్పటికే టీడీపీలో చేరారు.ఇక తాజాగా ఉండవెల్లి శ్రీదేవి,( Undavalli Sridevi ) మేకపాటి చంద్రశేకర్ రెడ్డి( Mekapati Chandrasekhar Reddy ) ఇవాళ టీడీపీలో అధికారికంగా చేరానున్నట్లు తెలుస్తోంది.
ఇదే ఊపులో వైసీపీ నుంచి మరికొంతమందిని టీడీపీ వైపు తిప్పుకుంటే.వైసీపీని గట్టిగా దెబ్బ తీసినట్లేనని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు.అందుకే వైసీపీలో మార్పులు జరుగుతున్న వేళ ఆపరేషన్ ఆకర్ష్ కు టీడీపీ తెర తీసినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.మరి వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ టార్గెట్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి.
టీడీపీ వ్యూహాలకు చెక్ పెట్టకపోతే వైసీపీ నుంచి వలసలు పెరగడం ఖాయమనేది కొందరి అభిప్రాయం.పార్టీలోనూ అలాగే ప్రజల్లో ఉన్న నేతలను పక్కన పెట్టేందుకు జగన్ ప్రణాళికలు వెస్తుంటే.
వాటిని టీడీపీలోకి చేర్చుకొని బలం పెంచుకునేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.మరి ఈ పరిణామాలు ఎవరికి మేలు.
ఎవరికి నష్టం చేకూరుస్తాయో చూడాలి.