మందులు వాడినా కూడా కొలెస్ట్రాల్ తగ్గడం లేదా..? అయితే ఇది మీకోసమే..!

ఈ మధ్యకాలంలో చాలామంది అధిక కొలెస్ట్రాల్( Cholestrol ) వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, గుండెపోటు( Heart Diseases ) ప్రమాదాన్ని పెంచుతుంది.

అయితే మొదట కొలెస్ట్రాల్ నీ మెరుగుపరచడానికి జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి.అలా చేయాలనుకుంటే ఆరోగ్యకరమైన మార్పులను ప్రయత్నించాలి.

ఇప్పటికే మందులు తీసుకుంటే ఇలాంటి మార్పులు కొలెస్ట్రాల్ తగ్గించే ప్రభావాన్ని మెరుగుపరుస్తాయి.సంతృప్త కొవ్వులను కూడా తగ్గించాలి.

అయితే సంతృప్త కొవ్వులు ప్రధానంగా రెడ్ మాంసం, పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులలో కనిపిస్తాయి.అయితే ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.

Advertisement

సంతృప్త కొవ్వుల వినియోగం తగ్గించడం వలన తక్కువ సంతృప్త కలిగిన లిపో ప్రోటీన్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ను( Bad Cholestrol ) తగ్గిస్తుంది.అయితే 40 ఏళ్లలోపు ఉన్న చాలా మందికి కొలెస్ట్రాల్ సమస్య ఉంది.

దీని వల్ల వారు ఎంతో బాధపడుతున్నారు.దీంతో పాటు గుండె జబ్బుల ముప్పు కూడా ఎక్కువగా పెరిగిపోతుంది.

అయితే దీని గురించి ఎవరికీ కూడా అవగాహన లేదు.ఇకపోతే కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా అవ్వడం వలన రక్తపోటు,( Blood Pressure ) మధుమేహం( Diabetes ) లాంటి వ్యాధులు కూడా పెరుగుతున్నాయి.

అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలంటే చాలా కష్టంగా మారిపోయింది.అయితే అసంతృప్త కొవ్వులు, ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మంచిది.అలాగే చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి వ్యాయామం( Exercise ) కూడా చాలా ముఖ్యం.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ప్రతిరోజు కనీసం 30 నిమిషాల వరకు యోగా( Yoga ) చేయడం వలన మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.ఇలా మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

సులభంగా తగ్గాలంటే ముఖ్యంగా వ్యాయామం చేయాలి.

అంతేకాకుండా బరువు ఎత్తుకు అనుగుణంగా ఉంటే కొలెస్ట్రాల్ గురించి ఆందోళన చెందాల్సిన పని ఉండదు.కాబట్టి అధిక బరువు( Over Weight ) కూడా పెరగకుండా చూసుకోవాలి.కొలెస్ట్రాల్ తో పాటు బరువు పెరగడం వలన మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు లాంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

అంతే కాకుండా ధూమపానం, మద్యపానానికి కూడా దూరంగా ఉండాలి.అంతేకాకుండా ఆల్కహాల్ అలవాటును కూడా తగ్గించుకోవాలి.

తాజా వార్తలు