పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో భారీ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ”ఆదిపురుష్”(Adipurush).ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ఆడియెన్స్ సైతం ఎదురు చూస్తున్నారు.
మరి మరో నెలరోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి నిన్న ఏవైటెడ్ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఈ సినిమా నుండి వచ్చిన తాజా ట్రైలర్ చూస్తుంటే మేకర్స్ చాలానే మార్పులు చేర్పులు చేసినట్టు, వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపించింది.దీంతో ఈ ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్స్ ను మెప్పించింది.ఈ ట్రైలర్ (Adipurush Trailer) కట్ ఎలా ఉంటుందో అని అనుకున్న ఫ్యాన్స్ కు ఓం రౌత్ ‘జై శ్రీరామ్’ అనే నినాదం ఫ్యాన్స్ చేసేలా చేసాడు.
ఇప్పటి వరకు సినిమా మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ పోయేలా చేసి పాజిటివ్ గా మార్చేశాడు.టీజర్ తో నిరాశ పరిచిన డైరెక్టర్ ఇప్పుడు ట్రైలర్ తో సినిమాలో చాలా ఉంది అనేలా చేసాడు.
మొత్తానికి ప్రేక్షకులను జూన్ 16 ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ సినిమా ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూసేలా చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

మరి ఆదిపురుష్ కూడా ఒక ఎపిక్ సినిమాగా చరిత్ర లో నిలిచి పోతుందో లేదో చూడాలి.భూషణ్ కుమార్, ఓం రౌత్, రాజేష్ మోహనన్, కృష్ణ కుమార్ ఈ సినిమాను టి సిరీస్ సంస్థపై 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఇక ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీత గా కృతి సనన్ (Kriti Sanon), సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) రావణాసురిడి గా కనిపించ నున్నారు.
చూడాలి ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడియెన్స్ ను మెప్పిస్తుందో.







