ఘనంగా షిరిడి సాయిబాబా వార్షికోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల షిరిడి సాయిబాబా ఆలయ 34 వ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది.ఈ మేరకు కీర్తిశేషులు ఏరే లచ్చయ్య ఈ ఆలయాన్ని నిర్మాణం చేయగా ఆయన కుమారుడు ఏరే నర్సయ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

 Shirdi Sai Baba Anniversary Celebrations In Rajanna Sircilla District, Shirdi Sa-TeluguStop.com

ఉదయం స్వామివారి చిత్రపటంతో గ్రామంలో ఊరేగింపు తీసి స్వామివారి ఆలయానికి వస్త్రాలతో చేరుకోవడం జరిగింది.

అనంతరం స్వామివారికి అభిషేకం చేయగా రెండు గంటల పాటు హోమం నిర్వహించారు.

శివ వేద శాస్త్రి శైలేంద్ర వీరేంద్ర శివశాస్త్రి పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.అనంతరం భక్తులు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని గ్రామస్తులకు అందించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు దొమ్మాటి నర్సయ్య,నిమ్మ లక్ష్మి, ఎంపీటీసీ అపేరా సుల్తానా, నాయకులు షేక్ గౌస్ మోతే లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube