ప్రభుత్వం ఆశా వర్కర్ల జీవితాలతో ఆడుకోవద్దు - సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ

రాజన్న సిరిసిల్ల జిల్లా : అనేక సంవత్సరాలుగా ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం , అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆశాలకు నష్టం కలిగించే విధంగా ఎగ్జామ్స్ పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని , ఆశాలకు 18 వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని , పని భారం తగ్గించి జాబ్ చాట్ ప్రకటించాలని అలాగే పెండింగ్ బకాయిలను చెల్లించాలని , ప్రమాద బీమా సౌకర్యం కల్పించి హెల్త్ కార్డులు అందించాలని తదితర డిమాండ్లతో సిఐటియు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం గేటు ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు ధర్నా చేస్తున్న ఆశా వర్కర్ల వద్దకు వచ్చి జిల్లాలో స్థానికంగా తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని మిగతా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించడం జరిగింది.

 Govt Should Not Play With Lives Of Asha Workers Citu Rajanna Sirisilla District-TeluguStop.com

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు గిరిజన ప్రాంతంలో గత 33 సంవత్సరాలు, మైదాన ప్రాంతంలో గత 19 సంవత్సరాల నుండి పని చేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారని ప్రారంభం నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన అనేక ట్రైనింగ్ లు పొందారని రిజిస్టర్లు రాయడం , సర్వేలు చేయడం, ఆన్లైన్ పని చేయడం, బిపి, షుగర్, థైరాయిడ్ తదితర అన్ని రకాల జబ్బులను గుర్తించి ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులను ప్రజలకు అందిస్తున్నారని తగిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తున్నారని అన్నారు.వీటితోపాటు గర్బిణి ,బాలింతలు, చిన్నపిల్లలు,ఇతర ప్రజలకు వివిధ రకాల సేవలందించడం జరుగుతుందని, కరోనా మహమ్మారి కాలంలో కరోనాను నియంత్రించడంలో ఆశా వర్కర్లు కీలకపాత్ర పోషించారన్నారు.

(డబ్ల్యూ.ఎచ్.ఓ.) ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ గ్లోబల్ లీడర్స్ అని ఆశా వర్కర్లకు అవార్డులను కూడా ప్రకటించిందని అన్ని పనులను నిర్వహిస్తూ ఇంత సీనియారిటీ ఉన్న ఆశ వర్కర్లకు కొత్తగా ఎగ్జామ్స్ నిర్వహించి కొత్తగా ఆశాల జ్ఞాపకశక్తిని మళ్ళీ నిరూపించుకోవాలని చెప్పడం సమంజసం కాదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరీక్షల నిర్వహణ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని,ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అన్నింటిని వెంటనే పరిష్కారం చేయాలని జిల్లాలో కూడా ఆశాలపై అధికారుల వేధింపులు , బెదిరింపులు మానుకోవాలని అన్నారు.ఆశాలకు నష్టం కలిగించే ఎగ్జామ్స్ పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు.

ఆశలకు పని భారం తగ్గించాలి , జాబ్ కార్డు ఇవ్వాలనీ,ఫిక్స్డ్ వేతనం 18,000 రూ చెల్లించాలన్నారు.పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ , ఇన్సూరెన్స్ , 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్నారు.

ప్రతినెలా 2వ తేదీన వేతనాలు చెల్లించాలనీ, ఆశలకు రావాల్సిన పెండింగు బిల్లులు అన్నింటిని వెంటనే చెల్లించాలనీ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆశలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేర్చాలన్నారు.

లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎలిగేటి రాజశేఖర్ , అన్నల్దాస్ గణేష్ , గురజాల శ్రీధర్ , ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జయశీల ,గౌరవ అధ్యక్షురాలు భారతి ,కస్తూరి ,చంద్రకళ , గాయత్రి , రాణి , లత , శాంత , రుక్మిణి , వరలక్ష్మి , లావణ్య , మమత , లక్ష్మి , సుజాత , స్వప్న , భూలక్ష్మి , తార , జమున , తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube