రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.దీనికి ముఖ్యఅతిథిగా సభ్యత్వ నమోదు కన్వీనర్ సంతోష్ రెడ్డి,శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కార్యకర్తలు, నాయకులు బూతులలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈనెల 25వ తేదీలోగా పూర్తి చేయాలని సభ్యత్వ నమోదులలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు ఆదరించేందుకు సభ్యత్వ నమోదు ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు,నాయకులు అందరూ పాల్గొని విజయవంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేయాలనీ తెలిపారు.
సభ్యత్వ నమోదుకు మిస్డ్ కాల్ 8800002024 చేయించగలరని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి,సభ్యత్వ నమోదు జిల్లా కన్వీనర్ సంతోష్ రెడ్డి,శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి బుగ్గారెడ్డి, నాయకులు చందుపట్ల లక్ష్మారెడ్డి,బందారపు లక్ష్మారెడ్డి, నంది నరేష్,గణేష్,బొమ్మాడి స్వామి, కిరణ్ నాయక్, రాజు యాదవ్,కార్యకర్తలు దాసు, రవి తదితరులు పాల్గొన్నారు.







