వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో గత రెండు రోజులుగా నిర్వహించిన గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిసినట్లు ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 Ganesh Immersion Celebrations Ended Peacefully In Vemulawada Sub-division, Ganes-TeluguStop.com

గణేష్ నిమజ్జన వేడుకలు ఎంతో వైభవంగా, ప్రశాంతంగా జరిగాయని, సహరించిన మున్సిపల్, రెవెన్యూ, దేవాదాయ, అగ్నిమాపక, ఇతర అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యంగా గణేష్ నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో జరిపి, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ వారికి సహకరించిన వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని గణేష్ మండపాల నిర్వాహకులకు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు, వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube