రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం, పాఠశాలలలో పాఠ్య పుస్తకాలు అమ్మవద్దని డిమాండ్ చేసిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్.ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అధ్వర్యంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రవి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి అని డిమాండ్ చేశారు.విద్య సంవత్సరము ప్రారంభం అయినా కూడా ఇప్పటి వరకు విద్య వ్యవస్థను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఫీజు నియంత్రణ చట్టం తీసుకువస్తాం, పేద,బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేస్తాం అని చెప్పారో వాటిని వెంటనే అమలు అయ్యేలా చూడాలని,ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రి నీ నియమించక పోవడం చాలా దురదృష్టం అని అన్నారు .ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యల మీద దృష్టి పెట్టీ వారి సమస్యలు పరిష్కరించాలని, అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాల ల మీద, అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యావ్యవస్థ ల మీద చర్యలు తీసుకోవాలన్నారు .ఈ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలలో పాఠ్య పుస్తకాలు అమ్మవద్దు అని చెప్పిన కూడా కొన్ని పాఠశాల లో అమ్ముతున్నారని అట్టి పాఠశాల ల మీద అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని
అవసరం ఐతే అలాంటి విద్య సంస్థలను మూసి వేయాలని వాటి అనుమతులు రద్దు చేయాలని పేద,బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రజా ప్రభుత్వం అంటే ఇదేనా అని డిమాండ్ చేశారు.ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేసి, ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలను అమ్మే పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పక్షాన విద్యార్థుల తరుపున నిరసన కార్యక్రమాలు చేపడుతామని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నాయకులు ఒగ్గు అరవింద్,రుద్రవేణి సుదీప్, కొడం వెంకటేష్,రాపెళ్లి భాను, ఎస్ డి అసిమ్, నరేష్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.







