రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ఏఎంసి పాలకవర్గాన్ని శనివారం ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.చైర్మన్ గా బోయినపల్లి కి చెందిన బోయిని ఎల్లేష్ యాదవ్ ,వైస్ చైర్మన్ గా దేశయిపల్లికి చెందిన నిమ్మ వినోద్ రెడ్డి ని నియమించారు.
డైరెక్టర్లు గా అనుముల హరికృష్ణ ,మమ్మద్ యూసఫ్ ,బాలగోని వెంకటేశ్వర్లు, అద్దంకి రమేష్, గుడి రాజశేఖర్ రెడ్డి,గంగిపల్లి లచ్చయ్య, నీరటి ప్రదీప్, కల్లేపల్లి సతీష్, మెరుపుల మహేష్, రోమాల అజయ్, ఏనుగుల కనకయ్య, జక్కని సందీప్ తో పాటు
బోయినపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ,అగ్రికల్చర్ ఏడిఏ వేములవాడ బోయినపల్లి గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ లను సభ్యులుగా నియమించారు.ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వర్ రావు,రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ,చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లతో పాటు బోయినపల్లి మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.