బిఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేసిన మాజీ ఎంపీటీసీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ పలు మార్లు మంత్రి కెటిఆర్ కు, రాష్ట్ర ప్రభుత్వం నకు విన్నవించినా పలితం లేకపోవడంతో వెంటనే రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీకి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ తెలిపారు.శనివారం అఖిల పక్ష సమావేశంలో పార్టీకి రాజీనామ చేయాలనే నిర్ణయం తీసుకుని రాజీనామా పత్రాన్ని మంత్రి కెటిఆర్ కు ఫ్యాక్స్, వ్యాట్సప్ ద్వారా రిజిష్టర్ పోస్టు ద్వారా పంపినట్లు ఆయన తెలిపారు.

 Ex Mptc Oggu Balaraju Yadav Resigns To Brs Party, Ex Mptc Oggu Balaraju Yadav ,-TeluguStop.com

ఇక మీదట ప్రజల ఆకాంక్ష,అభిప్రాయం మేరకు పనిచేస్తానని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఎల్లారెడ్డి పేట మండల రెవెన్యూ డివిజన్ సాధన సమితి కన్వీనర్ గా పనిచేస్తున్నాను అని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్ నాలుగు మండలాల ను కలిపి రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని మంత్రి కెటిఆర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.

మంత్రి కెటిఆర్ ఎల్లపుడూ ప్రజల ఆకాంక్షకు,అభీష్టానికి అనుగుణంగా ఉంటారని అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ముందు ఎల్లారెడ్డి పేట మండల కేంద్రము ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట కాంగ్రెస్ నాయకులు చేన్ని బాబు, గుండాడి రాం రెడ్డి,రఫిక్ పందిర్ల లింగం,వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ పుల్లయ్య గారి తిరుపతి,బీఎస్పీ జిల్లా అధ్యక్షులు వరదవెళ్లి స్వామి, తాటిపెల్లి అంజయ్య బిజేపి రాష్ట్ర ఓబిసి నాయకులు కంచర్ల పర్షరాములు తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube