రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దక్షిణ కాశిగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని స్వచదనం.పచ్చదనం జిల్లా ప్రత్యేక అధికారి, డైరెక్టర్ ఇంటర్మీడియట్ బోర్డు శృతి ఓఝా, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా స్వచదనం.పచ్చదనం జిల్లా ప్రత్యేక అధికారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆలయ కల్యాణ మండపంలో ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఇక్కడ ఆలయ ఈ.ఓ వినోద్ రెడ్డి, ఈఈ రాజేష్, ఆలయ పర్యవేక్షకులు హరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.