రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బిఆర్ఎస్,బీజేపి తదితర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఆరోపించారు.మండల కేంద్రము లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారిని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నారు అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్న వారిని నయానో, బయనో బెదిరిస్తున్నారని ఆరోపించారు.బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కు అతడి వయసుకు విలువ ఇస్తున్నామని అన్నారు.
విలువలు దిగ జార్చుకోవద్దని ఆగయ్య కు హితవు పలికారు.ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మ రెడ్డి,ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్,పసుల కృష్ణ, పెంజర్ల సత్తయ్య యాదవ్,ఆకుల లలిత,నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.