రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామంలో దసరా పండుగ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న రుద్రంగి పోలీస్ కానిస్టేబుల్ ఎండి ఇంతియాజ్ పై దాడికి పాల్పడిన వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష,1000/- రూపాయిల జరిమానా విధిస్తూ వేములవాడ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జ్యోతిర్మయి తీర్పు వెల్లడించినట్లు చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ 2017 దసరా పండుగ రోజున రుద్రంగి గ్రామంలోని హైస్కూల్ నందు దసరా పండుగ ఉత్సవాలు జరుగుతుండగా అక్కడ విధినిర్వహణలో ఉన్న రుద్రంగి పోలీస్ కానిస్టేబుల్ ఎండి ఇంతియాజ్ పైన రుద్రంగి గ్రామానికి చెందిన పెద్ది శ్రావణ్ S/o.లక్ష్మీనారాయణ అను వ్యక్తి విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ యొక్క విధులకు ఆటంకం కల్పిస్తూ దాడి దాడి చేయగా కానిస్టేబుల్ ఫిర్యాదు పై అప్పటి ఎస్సై రమేష్ కేసు నమోదు చేసుకొని విచారణ చేసి చార్షీట్ దాఖలు చేయగా, APP విక్రాంత్ ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించినారు,వేములవాడ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జ్యోతిర్మయి నిందితునికి 6 నెలల జైలు శిక్ష, 1000/- జరిమానా విధించారు.సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టిన కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, రుధ్రంగి ఎస్సై అశోక్, కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీందర్, కానిస్టేబుల్ మధుసూదన్ లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.