సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టకండి,కొంచెం ఆగి ఆలోచించండి.

సైబర్ నేరాలకు గురైతే చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100,లకు తక్షణమే కాల్ చేయండి రాజన్న సిరిసిల్ల జిల్లా : సైబర్ నేరగాళ్ల పట్ల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ఆశ,భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారు.

 Don't Invest By Looking At Ads On Social Media, Stop And Think. Social Media , A-TeluguStop.com

ఒక వ్యక్తికి ఏదైనా ఆశ చూపించి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయని అతని నుండి వ్యక్తిగత సమాచారం తీసుకుని సైబర్ నేరం చేయడం జరుగుతుందని, భయం ఏదైనా వ్యక్తికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ కానీ, పాన్ కార్డు కానీ, ఇతర అకౌంట్లు బ్లాక్ అవుతుందని భయపెట్టి వారి నుంచి వ్యక్తిగత సమాచారం తీసుకొని సైబర్ నేరం చేస్తున్నారు.ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ ఉపయోగం పెరగడం వల్ల ప్రతి వ్యక్తి ఏదో అవసరానికి ఫోన్లు వాడడం జరుగుతుంది.

అదే అదునుగా సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి మన బ్యాంకులు, వ్యాలెట్స్ ఇతర వాటి నుండి డబ్బులు సులువుగా దోచేస్తున్నారు కావున మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా చేయవచ్చు.

లేదా NCRP ఎన్ సి ఆర్ పి పోర్టల్ (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈ వారం రోజులు జరిగిన కొన్ని సైబర్ కేసుల వివరాలు తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాధితుడు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యొక్క రివార్డ్స్ పాయింట్స్ రీడింగ్ చేసుకోమని ఒక వ్యక్తి నుండి కాల్ రావడం జరిగింది బాధితుడు అది నమ్మి అతనితో ఓటీపీ షేర్ చేసుకున్నాడు దీని ద్వారా బాధితుడు ₹8234 నష్టపోయాడు.సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు నుండి అతని ఫ్రెండు ఓటిపి షేర్ తీసుకొని అతని ఓటిపి ద్వారా షేర్ షాట్ యాప్ లో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఒక తెలియని వ్యక్తి తో చాట్ చేయడం జరిగింది.

తర్వాత ఆ వ్యక్తి బాధితుడికి కాల్ చేసి హరేజ్మెంట్ కేసు పెడతానని చెప్పి 18,000/- రూపాయలు గూగుల్ పే చేయించుకున్నాడు.

సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి ఒక సస్పెక్ట్ మొబైల్ నెంబర్ నుండి దని లోన్ ఆప్ నుండి లోన్ ఇస్తామని చెప్పి డాక్యుమెంట్స్, ప్రాసెసింగ్ చార్జెస్ కింద డబ్బు పంపించమనగా బాధితుడు ₹17000 ట్రాన్స్ఫర్ చేసి మోసపోయాడు.

వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు మొబైల్ హబ్ అనే సైట్లు మొబైల్స్ చాలా తక్కువ ధరకు అమ్ముతున్నారని తెలుసుకొని అందులో ఒక మొబైల్ ఆర్డర్ గురించి 2500-/ రూపాయలు చెల్లించాడు కానీ ఆ సైట్ అతనికి ఎలాంటి మొబైల్ డెలివరీ చేయలేదు.అందుకు పై విధంగా ఎవరు ఫోన్ చేసి చెప్పినా సైబర్ నేరస్తులని గుర్తించి వారికి ఏ విధమైన సమాచారం ఇవ్వద్దని ఎస్పీ తెలిపారు.

తీసుకోవలసిన జాగ్రత్తలు:

నమ్మదగిన అప్స్ /వెబ్సైటు లలో మాత్రమే ఆర్డర్ చెయ్యండి.సోషల్ మీడియా లో యాడ్స్ చూసి ఆఫర్ లో వస్తున్నాయని, ఆ యాడ్స్ లో ఉండే నంబర్స్ కి కాల్ చేసి సైబర్ మోసాలకు గురి అవ్వదు మీ ఎస్ బి ఐ యోనో బ్లాక్ అయిందని పాన్ కార్డు అప్డేట్ చెయ్యమని వచ్చే మెసేజులు నమ్మకండి, ఇందులో ఉన్న లింక్స్ పై క్లిక్ చెయ్యకండసోషల్ మీడియా లో ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టకండి, కొంచెం ఆగి ఆలోచించండి, అది సైబర్ మోసం కూడా కావచ్చు.

మీ ప్రమేయం లేకుండా మీకు ఓటీపీ వస్తే దాన్ని ఎవరికీ చెప్పకండి.అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ అయివుండవచ్చు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube