రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండల కేంద్రంలో గల మైనార్టీ లకు మైనార్టీలు చనిపోతే ఖననం చేయడానికి ఖబ్రస్థాన్ కు అదే విధంగా క్రిస్టియన్ లకు సంబంధించి ఎవరైనా చనిపోతే ఖననం చేయడానికి సమాధుల తోటకు స్థలం లేదని దానికి సంబంధించి రెండు మతాలకు స్థలం కేటాయించాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu Balaraju Yadav (,మైనార్టీ నాయకులు ఎం డి సల్మాన్ లు సోమవారం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జరిగిన ప్రజావాణి లో జాయింట్ కలెక్టర్ ఖీమ్య నాయక్ కు వినతి పత్రం అందజేశారు.
ప్రస్తుతం మైనార్టీ లకు సంబంధించి 400 కుటుంబాలకు ఇప్పుడున్న ఖబ్రస్థాన్ స్థలం సరిపోవడం లేదని,అదే విధంగా క్రిస్టియన్ కుటుంబాలు కూడా సుమారు 300 కుటుంబాలు ఉన్నాయని వీరు చనిపోతే ప్రస్తుతం గిద్దె చెరువు వద్ద అంత్యక్రియలు జరుగుతున్నాయని దీంతో ఇబ్బంది అవుతుందనీ ప్రజావాణిలో విన్నవించారు.
ఎల్లారెడ్డిపేట గ్రామ శివారులో గల (ఎగోళం) గుట్ట వద్ద అయిదు ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని అట్టి దానిని ఇరు మతాలకు అందజేస్తే అంత్యక్రియలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వినతి పత్రంలో పేర్కొన్నారు.వెంటనే స్పందించిన జాయింట్ కలెక్టర్ ప్రజావాణి లో పాల్గొన్న ఎల్లారెడ్డిపేట మండల తహశీల్దార్ కార్యాలయం అధికారులను ఇట్టి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.