ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి లైన్ కడుతున్న విద్యార్థులు.

నాలుగు రోజుల్లో 30 కి పైగా అడ్మిషన్లు.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి కెటిఆర్( Minister KTR ) సహాయం తో నిర్మించుకోగా అందులో నే ప్రాథమిక పాఠశాల లో తరగతులను ప్రారంభించారు.

 Students Queuing Up To Join A Government School , Minister Ktr-TeluguStop.com

కాగా పాఠశాల నూతన హంగులతో పాఠశాల నిర్మాణము కాగా పెద్ద సంఖ్యలో ఇట్టి బడిలో చదవడానికి ఆసక్తి చూపుతున్నారు.ఈ నెల 12 న బడిబాట ప్రారంభం కాగా నేటి వరకు సుమారు 30 నూతన అడ్మిషన్లు పాఠశాలలో నమోదయ్యాయి.

నాలుగవ తరగతిలో పరిమితికి మించి 41 మంది విద్యార్థులు 4 వ తరగతిలో చదువుతున్నారు.పాఠశాల నిబంధనల ప్రకారం ఒక్కో తరగతి లో 30 మంది ఉండాల్సి ఉండగా కేవలం 4 వ తరగతి లో 41 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

శుక్రవారం పాఠశాలలో అక్షరాభ్యాసం ప్రారంభ కార్య్రమానికి వెళ్లిన ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ నేడు పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులను,వారి తల్లిదండ్రులను ఉపాద్యాయులను అభినందించారు.ఆమె వెంట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఉన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube